ఆదిత్య369 సీక్వెల్ లో మోక్షజ్ఞ
తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ మరోసారి స్పందించాడు. ఈసారి ఆయన తన ప్లాన్స్ మొత్తాన్ని బయటపెట్టారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్ చేయాలనుకున్న బాలయ్య.. ఇప్పుడు ఆ సీక్వెల్ తో కొడుకును పరిచయం చేయాలని నిర్ణయించారు. ఆదిత్య 999 టైటిల్ తో తెరకెక్కనున్న ఆ సీక్వెల్ ను తనే డైరెక్ట్ చేస్తానని ఆ సినిమాతో తన వారసుడు మోక్షజ్ఞ ని నటుడిగా పరిచయం చేయబోతున్నానని చెప్పుకున్నాడు బాలయ్య. ఇందులో బాలయ్య కూడా నటిస్తాడు. అంటే […]
తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ మరోసారి స్పందించాడు. ఈసారి ఆయన తన ప్లాన్స్ మొత్తాన్ని
బయటపెట్టారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్ చేయాలనుకున్న బాలయ్య..
ఇప్పుడు ఆ సీక్వెల్ తో కొడుకును పరిచయం చేయాలని నిర్ణయించారు.
ఆదిత్య 999 టైటిల్ తో తెరకెక్కనున్న ఆ సీక్వెల్ ను తనే డైరెక్ట్ చేస్తానని ఆ సినిమాతో తన వారసుడు
మోక్షజ్ఞ ని నటుడిగా పరిచయం చేయబోతున్నానని చెప్పుకున్నాడు బాలయ్య. ఇందులో బాలయ్య కూడా
నటిస్తాడు. అంటే ఇది మల్టీస్టారర్ అన్నమాట.
దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. తండ్రి దర్శకత్వంలోనే మోక్షజ్ఞ మొదటి
సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే సీక్వెల్ కి సంబంధించి కథ పూర్తి చేశాడు బాలయ్య. తనకి వచ్చిన
ఐడియాని డెవలప్ చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు.
తన తండ్రి తారకరామారావు డైరెక్షన్ లో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ అనే సినిమాతో నటుడిగా
పరిచయమయ్యాడు బాలయ్య. ఇప్పుడు అదే రూలు ఫాలో అవుతూ కొడుకుని తనే లాంచ్ చేస్తున్నారు.