సీఎంగా యడ్డీ కొనసాగుతారు? డౌట్​ అక్కర్లేదు..!

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప త్వరలో రాజీనామా చేయబోతున్నారని.. ఆయన స్థానంలో మరో వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. యడ్డీ కుమారుడు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం.. ఒకరిద్దరూ ఎమ్మెల్యేలు, ఓ మంత్రి యడ్డీ తీరు పట్ల అసంతృప్తిగా ఉండటం.. ఆయనపై బహిరంగంగా విమర్శలు చేయడం ఈ వాదనలకు బలం చేకూర్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా వారు యడియూరప్పపై […]

Advertisement
Update:2021-06-11 06:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప త్వరలో రాజీనామా చేయబోతున్నారని.. ఆయన స్థానంలో మరో వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. యడ్డీ కుమారుడు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం.. ఒకరిద్దరూ ఎమ్మెల్యేలు, ఓ మంత్రి యడ్డీ తీరు పట్ల అసంతృప్తిగా ఉండటం.. ఆయనపై బహిరంగంగా విమర్శలు చేయడం ఈ వాదనలకు బలం చేకూర్చాయి.

ఇదిలా ఉంటే ఇటీవల కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా వారు యడియూరప్పపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్ సింగ్​ క్లారిటీ ఇచ్చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. యడియూరప్ప పూర్తి కాలం పదవిలో ఉంటారని స్పష్టం చేశారు.

‘అసంతృప్తులు, భేదాభిప్రాయాలు ఉండటం సహజం. ఏ ఎమ్మెల్యేకైనా ఇబ్బంది ఉంటే అధిష్టానానికి ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాని ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు ఉండదు. యడియూరప్ప ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి మార్పు విషయం పై పదే పదే మీడియా అవాస్తవాలను ప్రసారం చేస్తున్నది’ అంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజీనామా వార్తలు, ముఖ్యమంత్రి మార్పు వార్తలకు తెరపడింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో విమర్శలను ఎదుర్కొన్నది. అంతేకాక త్వరలో యూపీ సహా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఈ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించింది.

Tags:    
Advertisement

Similar News