కీర్తి సురేష్ సినిమా ఓటీటీకి కాదంట

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ `గుడ్ లక్ సఖి` ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై […]

Advertisement
Update:2021-06-07 12:17 IST

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'గుడ్
లక్ సఖి' ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జగపతి బాబు కీలక పాత్రలో
నటిస్తున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న 'గుడ్ లక్ సఖి' సినిమాని తెలుగు, తమిళ
మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు.

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి,
శ్రావ్య వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. జూన్ 3న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేక‌ర్స్‌. అయితే కరోనా
సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని కూడా వాయిదా వేయాల్సి
వచ్చింది.

అయితే గత కొన్ని రోజులుగా ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ
రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పుకార్లపై స్పందించారు మేక‌ర్స్‌. '’గుడ్ లక్ సఖి’
సినిమా ఓటీటీలో విడుదల కానుందని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.. దయచేసి
పుకార్లను స్ప్రెడ్ చేయ‌కండి. ఏదైనా న్యూ అప్డేట్ ఉంటే స్వయంగా మేమే వెల్లడిస్తాం. ప్రతి ఒక్కరూ
ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నాం“ అంటూ స్పష్టత ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News