మొక్కలు నాటమంటున్న హీరో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సామాజిక బాధ్యత పరంగా ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పటికప్పుడు మంచి పనులు చేస్తూ అభిమానులకు కూడా మార్గదర్శిగా ఉంటాడు బన్నీ. ఇప్పుడు కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తన హార్ట్‌కు చాలా దగ్గరగా ఉందని.. పర్యావరణం అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా అందరూ మొక్కలు నాటాలని.. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని తెలిపారు […]

Advertisement
Update:2021-06-05 14:08 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సామాజిక బాధ్యత పరంగా ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పటికప్పుడు మంచి
పనులు చేస్తూ అభిమానులకు కూడా మార్గదర్శిగా ఉంటాడు బన్నీ. ఇప్పుడు కూడా ప్రపంచ పర్యావరణ
దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటాడు అల్లు అర్జున్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తన హార్ట్‌కు చాలా దగ్గరగా ఉందని.. పర్యావరణం అంటే
తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా అందరూ మొక్కలు నాటాలని.. పర్యావరణాన్ని
రక్షించడం మనందరి బాధ్యత అని తెలిపారు అల్లు అర్జున్.

అంతేకాదు.. అందరం మొక్కలు నాటాలనే ప్రతిజ్ఞ చేయాలని.. ఎకో ఫ్రెండ్లీగా (ప్రకృతికి అనుకూలంగా)
ఉండే అలవాట్లు అలవర్చుకోవాలని కోరారు. ప్రకృతి మనకు అందించిన ఈ వరాన్ని జాగ్రత్తగా
కాపాడుకుని.. వచ్చే తరానికి మరింత పచ్చదనంతో ఇవ్వాలని ఆయన కోరారు.

అలాగే అంతా మొక్కలు నాటాలని.. #GoGreenWithAA అనే హ్యాష్‌ట్యాగ్‌తో మొక్కలు నాటాలని..
వాళ్లందరి వీడియోలు కూడా తాను సోషల్ మీడియాలో రీ-పోస్ట్ చేస్తానని తెలిపారు అల్లు అర్జున్. బన్నీ
తీసుకున్న చొరవపై అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News