అందానికి శృతిహాసన్ ఇచ్చే నిర్వచనం!
ప్రస్తుతం శృతిహాసన్ 30వ వడిలో ఉంది. ఎంతో గ్లామరస్ గా కనిపిస్తోంది. సినిమాకు సినిమాకు కొత్తగా ఆమె మేకోవర్లు ఉంటున్నాయి. గ్లామర్ పరంగా ఆమె పీక్ స్టేజ్ ఇదే. అయితే అందానికి సరైన వయసు ఇది కాదంటోంది శృతిహాసన్. తన దృష్టిలో అందానికి నిర్వచనం ఇస్తోంది. “15-16 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో అసలైన అందం కనిపిస్తుంది. నా దృష్టిలో అందమంటే అదే. ఇక ఆ వయసు దాటిన తర్వాత మహిళల్లో అసలైన అందం 45-50 ఏళ్ల మధ్య కనిపిస్తుంది. […]
ప్రస్తుతం శృతిహాసన్ 30వ వడిలో ఉంది. ఎంతో గ్లామరస్ గా కనిపిస్తోంది. సినిమాకు సినిమాకు కొత్తగా ఆమె మేకోవర్లు ఉంటున్నాయి. గ్లామర్ పరంగా ఆమె పీక్ స్టేజ్ ఇదే. అయితే అందానికి సరైన వయసు ఇది
కాదంటోంది శృతిహాసన్. తన దృష్టిలో అందానికి నిర్వచనం ఇస్తోంది.
“15-16 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో అసలైన అందం కనిపిస్తుంది. నా దృష్టిలో అందమంటే అదే. ఇక ఆ వయసు దాటిన తర్వాత మహిళల్లో అసలైన అందం 45-50 ఏళ్ల మధ్య కనిపిస్తుంది. ఓ పరిపూర్ణ మహిళగా మారిన తర్వాత వచ్చే అందం అది. నా దృష్టిలో 16 ఏళ్ల వయసులో కనిపించే అందం.. 50 ఏళ్లప్పుడు ఉండే అందం రెండూ ఒక్కటే.”
ఇలా అందానికి తనదైన నిర్వచనం ఇచ్చింది శృతిహాసన్. ఇక తన గ్లామర్ విషయానికొస్తే.. సినిమాల్లో
తను అందంగా కనిపించడం కంటే ప్రత్యేకంగా కనిపించడానికి ఇష్టపడతానంటోంది. అందంగా
కనిపించడానికి, డిఫరెంట్ గా కనిపించడానికి మధ్య తేడాను అందరూ తెలుసుకోవాలని కోరుతోంది.