సమంత దృష్టిలో డేటింగ్ అంటే ఏంటి?
హీరోయిన్లు-డేటింగ్స్ ను విడదీసి చూడలేం. చాలామంది హీరోయిన్లకు డేటింగ్ చేసిన అనుభవం ఉంటుంది. కొంతమంది బయటపడతారు. మరికొంతమంది బయటపడరు. సమంత లాంటి హీరోయిన్లయితే తమ డేటింగ్ ను పెళ్లిగా కూడా మార్చుకొని లైఫ్ లో సెటిలైపోతారు. అయితే ఇప్పుడు మాత్రం సమంత డేటింగ్ కు అర్థం మార్చేసింది. మరీ ముఖ్యంగా నైట్ డేట్ అంటే తన దృష్టిలో ఏంటో చెబుతోంది సమంత. “నా దృష్టిలో నైట్ డేట్ కు ప్రత్యేకమైన అర్థం ఉంది. అందరూ ఊహించుకుంటున్నట్టు నేను […]
హీరోయిన్లు-డేటింగ్స్ ను విడదీసి చూడలేం. చాలామంది హీరోయిన్లకు డేటింగ్ చేసిన అనుభవం
ఉంటుంది. కొంతమంది బయటపడతారు. మరికొంతమంది బయటపడరు. సమంత లాంటి
హీరోయిన్లయితే తమ డేటింగ్ ను పెళ్లిగా కూడా మార్చుకొని లైఫ్ లో సెటిలైపోతారు. అయితే ఇప్పుడు
మాత్రం సమంత డేటింగ్ కు అర్థం మార్చేసింది. మరీ ముఖ్యంగా నైట్ డేట్ అంటే తన దృష్టిలో ఏంటో
చెబుతోంది సమంత.
“నా దృష్టిలో నైట్ డేట్ కు ప్రత్యేకమైన అర్థం ఉంది. అందరూ ఊహించుకుంటున్నట్టు నేను
ఆలోచించను. నా ఆలోచనల ప్రకారం నైట్ డేట్ అంటే మనసారా నవ్వుకోవాలి. కడుపు నిండా నచ్చిన
భోజనం చేయాలి. అదే నా దృష్టిలో నైట్ డేట్.”
ఇలా డేటింగ్ కు ఓ కొత్త అర్థం ఇచ్చింది సమంత. భర్త నాగచైతన్యతో కలిసి ఎప్పటికప్పుడు షికార్లు కొట్టే
ఈ బ్యూటీ.. కరోనా వల్ల ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నామని, పరిస్థితులు చల్లారిన తర్వాత కచ్చితంగా
చైతూతో ఫారిన్ డేట్ ప్లాన్ చేస్తానని చెబుతోంది.