మహేష్ సినిమాలో యాక్షన్ కింగ్

మహేష్-పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాకు సంబంధించి మరో పుకారు తెరపైకొచ్చింది. సర్కారువారి పాట సినిమాలో ఓ కీలక పాత్ర కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నారట. ఈ మేరకు దర్శకుడు-అర్జున్ మధ్య చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల నుంచి సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో అర్జున్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. మహేష్-అర్జున్ మధ్య తీయబోయే సన్నివేశాల కోసం ఓ ప్రత్యేకమైన […]

Advertisement
Update:2021-06-02 14:43 IST

మహేష్-పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాకు సంబంధించి మరో పుకారు తెరపైకొచ్చింది.
సర్కారువారి పాట సినిమాలో ఓ కీలక పాత్ర కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నారట. ఈ మేరకు
దర్శకుడు-అర్జున్ మధ్య చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల నుంచి సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ
షెడ్యూల్ లో అర్జున్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. మహేష్-అర్జున్ మధ్య తీయబోయే సన్నివేశాల
కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ను నిర్మించబోతున్నారు.

మరోవైపు ఈ సినిమా కొత్త షెడ్యూల్ కు సంబంధించి యూనిట్ కు మహేష్ కొన్ని షరతులు పెట్టాడు.
యూనిట్ లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలని కండిషన్
పెట్టాడు. ఈ మేరకు అందరికీ ముందుగా టీకాలు ఇప్పించాలని, ఒకవేళ ఎవరైనా మిస్ అయితే.. సెట్స్
లోనే టీకాలు వేయించే ఏర్పాటుచేయాలని నిర్మాతల్ని కోరాడు మహేష్.

Arjun
Tags:    
Advertisement

Similar News