18 పేజెస్.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్

సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా నటిస్తున్న ’18పేజెస్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. నేడు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఓ హోర్డింగ్ ద్వారా రివీల్ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్ బేనర్ పై తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరి నుండి రిలీజైన ఈ […]

Advertisement
Update:2021-06-01 12:53 IST

సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా నటిస్తున్న ’18పేజెస్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. నేడు నిఖిల్
పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఓ హోర్డింగ్ ద్వారా రివీల్ చేశారు. అల్లు అరవింద్
సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్ బేనర్ పై తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరి నుండి రిలీజైన ఈ
ఫస్ట్ లుక్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది.

ఫస్ట్ లుక్ లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో ఆమె పాత్ర చాలా కీలకమని చెప్పకనే
చెప్పారు మేకర్స్. “నా పేరు నందిని నాకు మొబైల్ లో అక్షరాలు టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితంపై
రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటుంది. కానీ
రాసే ప్రతీ అక్షరానికి ఒక ఫీలింగ్ వుంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే
బాగుంటుంది.” అంటూ పోస్టర్ లో నందిని పాత్ర తాలూకు భావాన్ని చెప్తూ నిఖిల్ కళ్ళకు ఓ పేపర్ కట్టి
దానిపై అనుపమ పెన్ తో రాసే స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు టీం.

ఇది కంప్లీట్ లవ్ స్టోరీ అనుకోలేం. సుకుమార్ రైటింగ్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే అందులో
కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి డిఫరెంట్ ఎలిమెంట్ ఒకటి ఉందని
ఇన్ సైడ్ టాక్.

Tags:    
Advertisement

Similar News