విజయ్ సినిమాను పక్కా చేసిన పైడిపల్లి

తమిళ స్టార్ హీరో విజయ్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందనే విషయం చాన్నాళ్లుగా చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుపై వంశీ పైడిపల్లి స్పందించాడు. సినిమా లాక్ అయిన విషయాన్ని స్పష్టంచేశాడు. దిల్ రాజు, విజయ్ కాంబినేషన్ లో సినిమా ఉందని.. కరోనా పరిస్థితులు చల్లారిన తర్వాత ఆ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తారని తెలిపాడు వంశీ పైడిపల్లి. ఓ మీడియా సంస్థకు […]

Advertisement
Update:2021-05-30 08:28 IST

తమిళ స్టార్ హీరో విజయ్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందనే
విషయం చాన్నాళ్లుగా చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఎట్టకేలకు
ఈ ప్రాజెక్టుపై వంశీ పైడిపల్లి స్పందించాడు. సినిమా లాక్ అయిన విషయాన్ని స్పష్టంచేశాడు.

దిల్ రాజు, విజయ్ కాంబినేషన్ లో సినిమా ఉందని.. కరోనా పరిస్థితులు చల్లారిన తర్వాత ఆ ప్రాజెక్టును
అధికారికంగా ప్రకటిస్తారని తెలిపాడు వంశీ పైడిపల్లి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ
విషయాన్ని బయటపెట్టాడు. దీంతో విజయ్-పైడిపల్లి కాంబినేషన్ పై క్లారిటీ వచ్చింది.

ఈ ప్రాజెక్టులో చాలా ప్రత్యేకతలున్నాయి. తెలుగులో విజయ్ కు ఇదే తొలి సినిమా. అటు వంశీ పైడిపల్లికి
తమిళ్ లో దర్శకుడిగా ఇదే తొలి సినిమా. అటు విజయ్ తో నిర్మాత దిల్ రాజుకు కూడా ఇదే తొలి సినిమా.
ఈ సినిమా కథ విజయ్ కు మాత్రమే సూట్ అవుతుందంటున్నాడు వంశీ పైడిపల్లి. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీతో
ఈ సినిమా తెరకెక్కనుందని స్పష్టంచేశాడు.

Tags:    
Advertisement

Similar News