గోబెల్స్ కి తాత.. చంద్రబాబు..
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చంద్రబాబు, ఆయన టీమ్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బ్లాక్ ఫంగస్ చికిత్స విషయంలో విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై నిందలు వేసే బదులు, కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రజలకు మేలు చేయొచ్చు కదా అని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ” నువ్వూ, నీ బాసూ గోబెల్స్ తాతల్లా తయారయ్యారు ఉమా. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. రోగుల అవసరాలకు సరిపోకున్నా […]
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చంద్రబాబు, ఆయన టీమ్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బ్లాక్ ఫంగస్ చికిత్స విషయంలో విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై నిందలు వేసే బదులు, కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రజలకు మేలు చేయొచ్చు కదా అని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
” నువ్వూ, నీ బాసూ గోబెల్స్ తాతల్లా తయారయ్యారు ఉమా. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. రోగుల అవసరాలకు సరిపోకున్నా రాష్ట్ర ప్రభుత్వం శత విధాలా ప్రయత్నించి ఔషధాల కొరత రాకుండా చూస్తోంది. ప్రభుత్వంపై రాళ్లేసే బదులు కేంద్రానికి లేఖ రాయమని మీ జూమ్ బాబుకు చెప్పు.” అని ట్వీట్ చేశారు.
కొవిడ్ రోగులకు సహాయం పేరుతో టీడీపీ నేతలు ఆస్పత్రలకు వెళ్లేందుకు హడావిడి చేస్తున్నారని, ఇవన్నీ రాజకీయ డ్రామాలని కొట్టిపారేశారు విజయసాయిరెడ్డి. తలుపులు గట్టిగా మూసుకుని పక్క రాష్ట్రంలో అజ్ఞాతంలో ఉన్న చంద్రబాబు చేసే హితబోధలు ఎవరికి కావాలని ప్రశ్నించారు. బాబు కార్యక్షేత్రంలోకి వచ్చి మాట్లాడితే విలువ ఉంటుందని సూచించారు.
అమరావతిలో ఒలింపిక్స్.. అందుకే తరిమికొట్టారు..
చంద్రబాబులాంటి వారిని తమ దేశంలో.. అయితే జైలు లేదా పిచ్చాసుపత్రిలో వేస్తారని స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కూషెపిన్ 21ఏళ్ల క్రితం వాతలు పెట్టారంటూ గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. అమరావతిలో ఒలంపిక్స్, ప్రతి ఇంటికీ ఏసీ పైపులైన్లు, హైపర్ లూప్ వ్యవస్థ తెస్తానంటూ సొల్లు కబుర్లు చెప్పబట్టే ప్రజలు చంద్రబాబుని తరిమి కొట్టారని విమర్శించారు.
ఆనందయ్య క్రెడిట్ కొట్టేసేందుకేనా..?
” నలుగురు ఎవరి గురించైనా అభిమానంగా చర్చించుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్ర దృష్టి అటు పడుతుంది. అందులోకి ఎలా దూరాలా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని స్కెచ్ వేస్తున్నాడు గుంట నక్కలా.” అని ట్విట్టర్ లో మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఆనందయ్య మందు పంపిణీని ప్రభుత్వం అడ్డుకుంటోందని బాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
నదీనదాలు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అన్న శ్రీశ్రీ మాటలను టీడీపీ నేతలు మరోరకంగా అర్థం చేసుకున్నారని. ల్యాండ్ కనిపిస్తే చాలు పత్తిపాటి పుల్లారావు పచ్చజెండా పాతేసేవారని, జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి… విశాఖ భూములు ఒక లెక్కా? అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. వైసీపీ వచ్చిన తర్వాత వారి కబ్జాలకు తెరపడిందని చెప్పారు.
తన రాజకీయ జీవితం ముగింపు దశకు చేరడం, కొడుకు లోకేష్ కెరీర్ ఇంకా పుంజుకోకపోవడంతో.. చంద్రబాబు ఫ్రస్టేషన్ తో రగిలిపోతున్నారని, అందుకే సొంత పార్టీ నేతల కెరీర్ ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.