ఆర్ఆర్ఆర్ హక్కులు వీళ్లకే!

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి నాన్-థియేట్రికల్ రైట్స్ పై మొన్నటివరకు చాలా గందరగోళం నడిచింది. ఈ సినిమా పూర్తి హక్కుల్ని దాదాపు 235 కోట్ల రూపాయలకు జీ గ్రూప్ దక్కించుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడీ అంశంపై పూర్తి క్లారిటీ వచ్చింది. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి కేవలం సౌత్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రమే జీ గ్రూప్ వశమయ్యాయి. అంటే సినిమా థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాత జీ5 యాప్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను పెడతారన్నమాట. తెలుగు, తమిళ, మలయాళ, […]

Advertisement
Update:2021-05-26 13:43 IST

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి నాన్-థియేట్రికల్ రైట్స్ పై మొన్నటివరకు చాలా గందరగోళం
నడిచింది. ఈ సినిమా పూర్తి హక్కుల్ని దాదాపు 235 కోట్ల రూపాయలకు జీ గ్రూప్ దక్కించుకున్నట్టు
ప్రచారం జరిగింది. ఇప్పుడీ అంశంపై పూర్తి క్లారిటీ వచ్చింది.

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి కేవలం సౌత్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రమే జీ గ్రూప్ వశమయ్యాయి. అంటే
సినిమా థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాత జీ5 యాప్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను పెడతారన్నమాట.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా జీ5లో అందుబాటులోకి వస్తుంది. హిందీ వెర్షన్
స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

ఇక అత్యంత కీలకమైన తెలుగు శాటిలైట్ రైట్స్ మాత్రం జీ గ్రూప్ సంస్థకు దక్కలేదు. ఆర్ఆర్ఆర్ తెలుగు
శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. హిందీ శాటిలైట్ మాత్రం జీ గ్రూప్ దక్కించుకుంది.
మొత్తమ్మీద జీ గ్రూప్ ఎన్ని రైట్స్ దక్కించుకున్నప్పటికీ, కీలకమైన తెలుగు శాటిలైట్ రైట్స్ మాత్రం స్టార్
మా వశమయ్యాయి.

Tags:    
Advertisement

Similar News