గూని బాబ్జీ వచ్చేశాడు
మహాసముద్రం సినిమాలో పాత్రలన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పటికే శర్వానంద్, సిద్దార్థ్ క్యారెక్టర్స్ తో పాటు హీరోయిన్ల పాత్రల్ని కూడా పరిచయం చేసిన యూనిట్ ఈరోజు కీలక పాత్రధారి రావురమేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. విలక్షణ నటుడు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహా సముద్రం చిత్రం నుండి రావురమేష్ కి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర […]
మహాసముద్రం సినిమాలో పాత్రలన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పటికే శర్వానంద్, సిద్దార్థ్ క్యారెక్టర్స్ తో
పాటు హీరోయిన్ల పాత్రల్ని కూడా పరిచయం చేసిన యూనిట్ ఈరోజు కీలక పాత్రధారి రావురమేష్ పాత్రకు
సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది.
విలక్షణ నటుడు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహా
సముద్రం చిత్రం నుండి రావురమేష్ కి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది
చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌తో పాటు ఈ మూవీలో రావు రమేష్ గూని బాబ్జీగా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు
తెలిపింది. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్‌కి రావు రమేష్ తనదైన నటనతో పూర్తి న్యాయం చేస్తారని
ఖచ్చితంగా చెప్పవచ్చు.
యంగ్ హీరోస్ శర్వానంద్, సిద్దార్ధ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న మహాసముద్రం చిత్రాన్ని దర్శకుడు
అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన
శర్వానంద్, సిద్దార్ధ్, అధితిరావు హైదరి, అనూ ఇమాన్యూయేల్, జగపతిబాబు లుక్స్‌కి మంచి రెస్పాన్స్
వచ్చింది. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
పతాకంపై అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.