సలార్ లో విలన్ అతడేనా?

సలార్ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ భారీ షెడ్యూల్ పూర్తయింది. లాక్ డౌన్ కు ముందు, కరోనా కేసులు పెరగని టైమ్ లోనే సింగరేణి, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. మూవీలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని కూడా ప్రకటించారు. అయితే విలన్ ఎవరనేది మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం.. సలార్ సినిమాలో జాన్ అబ్రహాంను విలన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ మొదలైన వెంటనే ఈ […]

Advertisement
Update:2021-05-25 13:36 IST

సలార్ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ భారీ షెడ్యూల్ పూర్తయింది. లాక్ డౌన్ కు ముందు, కరోనా
కేసులు పెరగని టైమ్ లోనే సింగరేణి, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి భారీ
షెడ్యూల్ పూర్తిచేశారు. మూవీలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని కూడా ప్రకటించారు. అయితే విలన్
ఎవరనేది మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు.

తాజా సమాచారం ప్రకారం.. సలార్ సినిమాలో జాన్ అబ్రహాంను విలన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త
షెడ్యూల్ మొదలైన వెంటనే ఈ పేరును అధికారికంగా ప్రకటిస్తారట. జాన్ అబ్రహాంకు విలన్ గా
నటించడం కొత్తకాదు. అతడి చేరికతో సలార్ సినిమాకు మరింతగా పాన్ ఇండియా అప్పీల్
వచ్చినట్టయింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సలార్ సినిమా. మూవీలో ప్రభాస్ గ్యాంగ్ స్టర్ గా
కనిపించబోతున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News