బ్లాక్ ఫంగస్ మందులకు భారీ డిమాండ్..
కరోనా నివారణకు వాడే రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్ దందా ఇప్పటి వరకు చూశాం. ఒక్కో ఇంజక్షన్ 40వేల వరకు బ్లాక్ మార్కెట్ లో రేటు పలికిన సందర్భాలున్నాయి. బ్లాక్ లో కొనాలనుకున్నా.. సీసాలో ఉంది మెడిసినా లేక సెలైన్ వాటరా అనేది కూడా అనుమానమే. రానురాను సీరియస్ కేసులు తగ్గడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం రెమిడెసివిర్ తో ఉపయోగం లేదని తేల్చి చెప్పడంతో ఆ ఇంజక్షన్ కి డిమాండ్ తగ్గింది. తాజాగా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ […]
కరోనా నివారణకు వాడే రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్ దందా ఇప్పటి వరకు చూశాం. ఒక్కో ఇంజక్షన్ 40వేల వరకు బ్లాక్ మార్కెట్ లో రేటు పలికిన సందర్భాలున్నాయి. బ్లాక్ లో కొనాలనుకున్నా.. సీసాలో ఉంది మెడిసినా లేక సెలైన్ వాటరా అనేది కూడా అనుమానమే. రానురాను సీరియస్ కేసులు తగ్గడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం రెమిడెసివిర్ తో ఉపయోగం లేదని తేల్చి చెప్పడంతో ఆ ఇంజక్షన్ కి డిమాండ్ తగ్గింది. తాజాగా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఇంజక్షన్లకు డిమాండ్ పెరిగింది. యాంపోటెరిసిన్-బి అనే ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ కు తరలుతోంది. కేంద్రం ఇచ్చే డోసులు సరిపోకపోవడంతో.. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ ఇంజక్షన్ ను భారీ రేటు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ఏపీలో ఇప్పటి వరకు 252మంది బ్లాక్ ఫంగస్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీని చికిత్సలో ఉపయోగించే యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్లను కేంద్రం రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. చికిత్సకు అవసరమయ్యే యాంపొటెరిసిన్–బి ఇంజక్షన్లను రోగులకు ఇప్పటివరకు 309 ఉపయోగించారు. ఏపీలోని ఆస్పత్రుల్లో మరో 575 అందుబాటులో ఉన్నాయి. బాధితుడి బరువుని బట్టి కిలోకు 5 మిల్లీగ్రాముల (ఎంజీ) ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రోజుకు ఆరు ఇంజక్షన్ల చొప్పున పదినుంచి 20రోజులపాటు ఇవ్వాలి. ఒకవేళ అప్పటికే బాధితుడి మెదడుకు ఫంగస్ అటాక్ అయితే.. శరీరబరువు లెక్క ప్రకారం కిలోకు 10 ఎంజీ ఇవ్వాలి.
ఈ లెక్కన ప్రస్తుతం కేంద్రం సరఫరా చేసిన ఇంజక్షన్లు ఏపీలో నాలుగు జిల్లాలకు కూడా సరిపోవు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మందులు వెంటనే సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నారు. పొసకొనజోల్ అనే మరో మెడిసిన్ కూడా బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఇంజక్షన్లు 443, పొసకొనజోల్ మాత్రలు 14,270 అందుబాటులో ఉన్నాయి. రోజు రోజుకీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండటంతో.. మందులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఏపీతోపాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉంది.