తమన్నాకు మరో ఓటీటీ ఫ్లాప్

సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తమన్న, ఓటీటీలో మాత్రం ఇప్పటివరకు బోణీ కొట్టలేకపోయింది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. అది కాస్తా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరోటి చేసింది. దురదృష్టవశాత్తూ అది కూడా ఫ్లాప్ అయింది. ముందుగా ఆహా గురించి మాట్లాడుకుందాం. ఈ యాప్ తోనే తమన్న డెబ్యూ ఇచ్చింది. లెవెన్త్ అవర్ అనే వెబ్ డ్రామా చేసింది. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ వెంటనే డిస్నీ హాట్ స్టార్ […]

Advertisement
Update:2021-05-23 12:17 IST

సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తమన్న, ఓటీటీలో మాత్రం ఇప్పటివరకు బోణీ
కొట్టలేకపోయింది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. అది కాస్తా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరోటి
చేసింది. దురదృష్టవశాత్తూ అది కూడా ఫ్లాప్ అయింది.

ముందుగా ఆహా గురించి మాట్లాడుకుందాం. ఈ యాప్ తోనే తమన్న డెబ్యూ ఇచ్చింది. లెవెన్త్ అవర్ అనే
వెబ్ డ్రామా చేసింది. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ వెంటనే డిస్నీ హాట్ స్టార్ కు మరో వెబ్ సిరీస్
చేసింది. దాని పేరు నవంబర్ స్టోరీ.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కూడా తమన్నకు కలిసి రాలేదు. 7 ఎపిసోడ్ల సిరీస్
గా వచ్చిన ఈ వెబ్ డ్రామాలో తమన్న ఎథికల్ హ్యాకర్ గా నటించింది. ఓ మర్డర్ కేసు నుంచి తన తండ్రిని
తమన్న ఎలా రక్షించుకుందనే ఈ స్టోరీని మేకర్స్ చాలా నెమ్మదిగా చెప్పారు. అదే ఈ సిరీస్ కు పెద్ద
సమస్యగా మారింది.

మొత్తమ్మీద తమన్నకు మాత్రం ప్రస్తుతానికి ఓటీటీ కలిసిరాలేదు. త్వరలోనే మరో వెబ్ సిరీస్ తో ఆమె
పలకరించబోతోంది.

Tags:    
Advertisement

Similar News