ప్రభాస్ షర్ట్ విప్పబోతున్నాడు
టాలీవుడ్ లో ఆజానుబాహుడంటే ప్రభాసే. అతడి హైట్, వెయిట్, ఫిజిక్ ప్రభాస్ కు ప్లస్ పాయింట్స్. అయితే బాలీవుడ్ సల్మాన్ ఖాన్ టైపులో ఎప్పుడు పడితే అప్పుడు షర్ట్ విప్పడానికి ప్రభాస్ ఒప్పుకోడు. సరైన సందర్భం, కంటెంట్ పడితేనే షర్ట్ తీస్తాడు. అలా ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీని బాహుబలి-1, బాహుబలి-2లో చూశారు ప్రేక్షకులు. అయితే ఆ తర్వాత వచ్చిన సాహోలో మాత్రం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీ చూసే అవకాశం రాలేదు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ […]
టాలీవుడ్ లో ఆజానుబాహుడంటే ప్రభాసే. అతడి హైట్, వెయిట్, ఫిజిక్ ప్రభాస్ కు ప్లస్ పాయింట్స్.
అయితే బాలీవుడ్ సల్మాన్ ఖాన్ టైపులో ఎప్పుడు పడితే అప్పుడు షర్ట్ విప్పడానికి ప్రభాస్ ఒప్పుకోడు.
సరైన సందర్భం, కంటెంట్ పడితేనే షర్ట్ తీస్తాడు. అలా ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీని బాహుబలి-1,
బాహుబలి-2లో చూశారు ప్రేక్షకులు.
అయితే ఆ తర్వాత వచ్చిన సాహోలో మాత్రం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీ చూసే అవకాశం రాలేదు.
ఇప్పుడు మరోసారి ప్రభాస్ తన బాడీని చూపించబోతున్నాడు. తన కొత్త సినిమాలో షర్ట్ విప్పి
నటించబోతున్నాడు. అదే సలార్.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంది. ఆ యాక్షన్
సీన్ లో ప్రభాస్ షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడు. దీని కోసం ఇప్పుడు మరోసారి కసరత్తులు
ప్రారంభించాడు ఈ హీరో. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.