ఎన్టీఆర్ సినిమాపై కొరటాల క్లారిటీ

ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ తో కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. సినిమా ప్రకటించినప్పుడే ఈ సారి రిపేర్లు పాన్ ఇండియా లెవెల్లో జరుగుతాయంటూ జనతా గ్యారేజీ స్టయిల్ లో చెప్పకనే చెప్పాడు కొరటాల. ఇంతకీ ఎన్టీఆర్-కొరటాల శివ అప్ డేట్ ఏంటి.. ఈ ప్రాజెక్టు ఎంత వరకు వచ్చింది. “ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా పని మీదే ఉన్నాను. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దాదాపు […]

Advertisement
Update:2021-05-23 12:19 IST

ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ తో కలిసి
మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. సినిమా ప్రకటించినప్పుడే ఈ సారి రిపేర్లు పాన్ ఇండియా లెవెల్లో
జరుగుతాయంటూ జనతా గ్యారేజీ స్టయిల్ లో చెప్పకనే చెప్పాడు కొరటాల. ఇంతకీ ఎన్టీఆర్-కొరటాల శివ
అప్ డేట్ ఏంటి.. ఈ ప్రాజెక్టు ఎంత వరకు వచ్చింది.

“ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా పని మీదే ఉన్నాను. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దాదాపు 90 శాతం వర్క్
పూర్తయింది. మరోసారి చూసుకోవాలి. ఆ తర్వాత ఎన్టీఆర్ ను కలవాలి. కొంచెం టైం పడుతుంది”

అయితే ఈ టైమ్ లో స్క్రిప్ట్ రాసేకంటే, కరోనా బాధితుల్ని ఆదుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం
ఇస్తున్నానని తెలిపాడు కొరటాల. చాలామంది కరోనాతో ఇబ్బంది పడుతున్నారని, వాళ్లకు చేతనంత
సాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందంటున్న కొరటాల.. కరోనా కల్లోలం తగ్గిన తర్వాత తన బాధ్యత
ఇంకాస్త పెరుగుతుందంటున్నాడు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్లను
చదివించే బాధ్యత తీసుకుంటానని, తనకు తెలిసిన వాళ్లను కూడా ఈ దిశగా ప్రోత్సహిస్తానని
చెబుతున్నాడు కొరటాల.

Tags:    
Advertisement

Similar News