బుచ్చిబాబుకు ఛాన్స్ లేనట్టే?

ఉప్పెన హిట్టయిన వెంటనే దర్శకుడు బుచ్చిబాబుకు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్. బుచ్చి కూడా అంతే ఉత్సాహంగా పనిచేశాడు. కుటుంబానికి దూరంగా ఓ హోటల్ తీసుకొని మరీ నెల రోజులు అందులోనే ఉండి కథ రాశాడు. ఎన్టీఆర్ కు వినిపించాడు. అలా ఎన్టీఆర్-బుచ్చి మధ్య 2 నెరేషన్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఫైనల్ వెర్షన్ మాత్రమే. అది పూర్తయితే ప్రాజెక్టు లాక్ అయినట్టే. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. అయితే ఆఖరి నిమిషంలో ప్రాజెక్టు నిలిచిపోయింది. […]

Advertisement
Update:2021-05-21 15:19 IST

ఉప్పెన హిట్టయిన వెంటనే దర్శకుడు బుచ్చిబాబుకు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్. బుచ్చి
కూడా అంతే ఉత్సాహంగా పనిచేశాడు. కుటుంబానికి దూరంగా ఓ హోటల్ తీసుకొని మరీ నెల రోజులు
అందులోనే ఉండి కథ రాశాడు. ఎన్టీఆర్ కు వినిపించాడు.

అలా ఎన్టీఆర్-బుచ్చి మధ్య 2 నెరేషన్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఫైనల్ వెర్షన్ మాత్రమే. అది
పూర్తయితే ప్రాజెక్టు లాక్ అయినట్టే. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. అయితే ఆఖరి నిమిషంలో ప్రాజెక్టు
నిలిచిపోయింది. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ వస్తుందని చెప్పలేం. అలా అని ఈ సినిమా ఆగిపోయిందని
చెప్పలేం. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి మరి.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో
సినిమా చేయబోతున్నాడు. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే. వీటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా ఎన్టీఆర్
రేంజ్ మారిపోతుంది. అతడి స్టోరీ సెలక్షన్, బడ్జెట్, దర్శకులు, నిర్మాతలు.. ఇలా అంతా మారిపోతారు. సో..
రాబోయే రోజుల్లో బుచ్చిబాబుకు తారక్ ఛాన్స్ ఇస్తాడా అనేది ఇప్పట్లో తేలే అంశం కాదు.

Tags:    
Advertisement

Similar News