బంగార్రాజు వచ్చేస్తున్నాడోచ్

‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి రానుందని ప్రచారం మొదలైంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ వచ్చే సంక్రాంతి కి ‘బంగార్రాజు’ అంటూ పోస్టులు పెట్టుకుంటున్నారు. నిజానికి ‘బంగార్రాజు’ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయి చాలా నెలలవుతుంది. కాకపోతే సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతోంది. రకరకాల కారణాల వల్ల ఆలస్యమౌతోంది. […]

Advertisement
Update:2021-05-21 15:18 IST

‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి రానుందని ప్రచారం
మొదలైంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ వచ్చే సంక్రాంతి కి ‘బంగార్రాజు’ అంటూ పోస్టులు
పెట్టుకుంటున్నారు.

నిజానికి ‘బంగార్రాజు’ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయి చాలా నెలలవుతుంది. కాకపోతే సెట్స్ పైకి వెళ్ళడానికి
టైం పడుతోంది. రకరకాల కారణాల వల్ల ఆలస్యమౌతోంది.

అయితే లేటెస్ట్ గా ఈ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. సినిమా షూటింగ్ ఏడాది చివరి లోపు ఫినిష్
చేయగలిగితేనే మొదలు పెడతానని లేదంటే వచ్చే సంక్రాంతికి సినిమా ఉంటుందని. ఆ సినిమా ఎప్పుడు
పూర్తయిన థియేటర్స్ లోకి మాత్రం సంక్రాంతి కే వస్తుందని క్లారిటీ ఇచ్చాడు నాగ్.

దీంతో జులై నుండి నాగార్జున ఈ సీక్వెల్ షూట్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడని , వచ్చే సంక్రాంతి కి
సినిమా రిలీజ్ ఉంటుందనే అంతా ఫిక్స్ అయిపోయారు. కల్యాణ్ కృష్ణ డైరక్షన్ లో రాబోతున్న ఈ
సినిమాలో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Tags:    
Advertisement

Similar News