తారక్ జీవితంలో ఇలాంటి బర్త్ డే రాకూడదు?

ఈరోజు తారక్ తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నాడు. సెలబ్రేట్ చేసుకున్నాడు అనేకంటే.. సైలెంట్ గా ఉన్నాడని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే, ప్రస్తుతం అతడు కొవిడ్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో జరుపుకోకపోయినా, ఫ్రెండ్స్ ను పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వకపోయినా, కుటుంబ సభ్యులతో మాత్రం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాడు ఎన్టీఆర్. ప్రతి బర్త్ డేకి కొడుకుతో కలిసి కేక్ కట్ చేయడం తారక్ కు అలవాటు. ఈసారి […]

Advertisement
Update:2021-05-20 14:22 IST

ఈరోజు తారక్ తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నాడు. సెలబ్రేట్ చేసుకున్నాడు అనేకంటే.. సైలెంట్ గా
ఉన్నాడని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే, ప్రస్తుతం అతడు కొవిడ్ బారిన పడి ఇప్పుడిప్పుడే
కోలుకుంటున్నాడు.

తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో జరుపుకోకపోయినా, ఫ్రెండ్స్ ను పిలిచి గ్రాండ్ గా పార్టీ
ఇవ్వకపోయినా, కుటుంబ సభ్యులతో మాత్రం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాడు ఎన్టీఆర్. ప్రతి బర్త్
డేకి కొడుకుతో కలిసి కేక్ కట్ చేయడం తారక్ కు అలవాటు.

ఈసారి ఆ ఆనందం కూడా ఎన్టీఆర్ కు లేకుండా పోయింది. భార్యాపిల్లలకు దూరంగా ఐసొలేషన్ లో
ఉంటున్నాడు యంగ్ టైగర్. తారక్ కు ఇలాంటి ఇబ్బందికరమైన పుట్టినరోజు భవిష్యత్తులో రాకూడదని
కోరుంటున్నారు అతడి ఫ్యాన్స్.

ఇక సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో
పోస్టర్ రిలీజ్ చేశారు. బల్లెం పట్టుకొని తీక్షణంగా గురిపెడుతున్న స్టిల్ అది. ఇక మైత్రీ మూవీ మేకర్స్
బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను మరోసారి అధికారికంగా ప్రకటించారు.
అటు కొరటాల శివ సినిమాకు సంబంధించి ఓ కొత్త ఫొటో షూట్ స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News