గట్టిగా ఏడవాలని ఉంది
ఎప్పుడూ నవ్వుతూ, గ్లామరస్ ఫొటోలు పెట్టే పాయల్ రాజ్ పుత్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. అర్థరాత్రి వేళ ఓ పోస్ట్ పెట్టింది. గట్టిగా ఏడవాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. పాయల్ ఇలా సీరియస్ అవ్వడానికి కారణం ఉంది. తనకు ఎంతో దగ్గరైన ఓ బంధువును ఆమె కరోనా కారణంగా కోల్పోయింది. దీంతో దుఃఖం ఆపుకోలేకపోయింది. తన బాధ, ఆవేదన మొత్తాన్ని ట్విట్టర్ లో కక్కేసింది. ‘‘ఏడవాలని అనిపిస్తోంది… మాటలు కూడా రావడం లేదు. ఆప్తులను కోల్పోయాను. ఈ కరోనా […]
ఎప్పుడూ నవ్వుతూ, గ్లామరస్ ఫొటోలు పెట్టే పాయల్ రాజ్ పుత్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది.
అర్థరాత్రి వేళ ఓ పోస్ట్ పెట్టింది. గట్టిగా ఏడవాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. పాయల్ ఇలా సీరియస్
అవ్వడానికి కారణం ఉంది.
తనకు ఎంతో దగ్గరైన ఓ బంధువును ఆమె కరోనా కారణంగా కోల్పోయింది. దీంతో దుఃఖం
ఆపుకోలేకపోయింది. తన బాధ, ఆవేదన మొత్తాన్ని ట్విట్టర్ లో కక్కేసింది.
‘‘ఏడవాలని అనిపిస్తోంది… మాటలు కూడా రావడం లేదు. ఆప్తులను కోల్పోయాను. ఈ కరోనా సంక్షోభంలో
సొంతవారిని కోల్పోయిన వారినందరిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది,” అని పోస్ట్ చేసింది
పాయల్. ఒకరికి ఒకరం అండగా నిలబడాల్సిన టైమ్ ఇదేనంటూ అభిమానులకు పిలుపునిచ్చింది.