ఇలా వ్యాక్సిన్.. అలా ట్రోలింగ్

ఈమధ్య ఏం చేసినా ప్రియుడితో కలిసే చేస్తోంది హీరోయిన్ నయనతార. చివరికి కరోనా వ్యాక్సిన్ కూడా ప్రియుడితో కలిసే వేయించుకుంది. తాజాగా ఈ ఇద్దరు ప్రేమికులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా పెట్టారు. అయితే ఆ ఫొటోలు ఇలా వచ్చాయో లేదో అలా వీళ్లిద్దరిపై ట్రోలింగ్ మొదలైంది. ప్రస్తుతం 18-44 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండడంతో.. 45 ఏళ్లు దాటిన వ్యక్తులకే […]

Advertisement
Update:2021-05-19 12:58 IST

ఈమధ్య ఏం చేసినా ప్రియుడితో కలిసే చేస్తోంది హీరోయిన్ నయనతార. చివరికి కరోనా వ్యాక్సిన్ కూడా
ప్రియుడితో కలిసే వేయించుకుంది. తాజాగా ఈ ఇద్దరు ప్రేమికులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దానికి
సంబంధించిన ఫొటోలు కూడా పెట్టారు. అయితే ఆ ఫొటోలు ఇలా వచ్చాయో లేదో అలా వీళ్లిద్దరిపై
ట్రోలింగ్ మొదలైంది.

ప్రస్తుతం 18-44 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ కొరత
తీవ్రంగా ఉండడంతో.. 45 ఏళ్లు దాటిన వ్యక్తులకే రెండో డోసు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ
మేరకు కేంద్రం, రాష్ట్రాలన్నింటికీ పరిమితంగా డోసులు సరఫరా చేస్తోంది.

ఇలాంటి టైమ్ లో నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి ఇలా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీళ్లిద్దరూ
45 ఏళ్ల లోపు వ్యక్తులనే సంగతి తెలిసిందే. సరిగ్గా ఇక్కడే వీళ్లు నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు.
పలుకుబడి ఉపయోగించి కరోనా వ్యాక్సిన్ వేయించుకునే కంటే, కొన్నాళ్లు ఆగితే.. ఆ 2 డోసులు 45 ఏళ్లు
పైపడిన వ్యక్తులకు ఉపయోగపడేదంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

నిజమే.. 45 ఏళ్లు పైడిన చాలామంది వ్యక్తులకు ఇప్పుడు సెకెండ్ డోస్ దొరకడం లేదు. సకాలంలో సెకెండ్ డోస్ వేయకపోతే, మొదటి డోస్ ప్రభావం ఉండదు. ఈ విషయాలు తెలిసి కూడా నయనతార
అత్యుత్సాహం చూపించిందంటున్నారు నెటిజన్లు.

Tags:    
Advertisement

Similar News