మహేష్ మూవీలో మరో హీరో
మహేష్-త్రివిక్రమ్ సినిమాపై రోజుకో రూమర్ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ పుకారు తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ తో పాటు మరో హీరో కూడా ఉంటాడంట. ఆ హీరో కూడా మరెవరో కాదు, అక్కినేని హీరో సుమంత్ మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉందట. ఆ పాత్రను సుమంత్ తో చేయిస్తే బాగుంటుందని త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడట. మహేష్-సుమంత్ ఎలాగూ మంచి స్నేహితులు కాబట్టి, మహేష్ […]
మహేష్-త్రివిక్రమ్ సినిమాపై రోజుకో రూమర్ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో
క్రేజీ పుకారు తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ తో పాటు మరో హీరో కూడా
ఉంటాడంట. ఆ హీరో కూడా మరెవరో కాదు, అక్కినేని హీరో సుమంత్
మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉందట. ఆ పాత్రను సుమంత్ తో చేయిస్తే
బాగుంటుందని త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడట. మహేష్-సుమంత్ ఎలాగూ మంచి స్నేహితులు కాబట్టి,
మహేష్ అడిగితే సుమంత్ నో చెప్పే ఛాన్స్ లేదు.
ఇంతకు ముందు తీసిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా ఇలానే అక్కినేని హీరోను
తీసుకున్నాడు త్రివిక్రమ్. ఆ సినిమాలో బన్నీతో పాటు సుశాంత్ నటించాడు. ఇప్పుడు మహేష్ మూవీ
కోసం మరో అక్కినేని హీరో సుమంత్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట.
ఇంతకుముందు ఇదే సినిమాలో అక్కినేని కోడలు సమంతను హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు రూమర్లు
వచ్చాయి. అంతలోనే సుమంత్ పేరు కూడా తెరపైకి వచ్చింది.