గని మూవీపై అనుమానాలు
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీ గని. వరుణ్ ఇందులో బాక్సర్ గా కనిపిస్తున్నాడు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. మరో 20శాతం మాత్రం పెండింగ్ ఉంది. ఇలాంటి టైమ్ లో ఊహించని విధంగా గని సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కొంత స్క్రిప్ట్ మార్చమని వరుణ్ తేజ్ కోరాడంట. దీనికితోడు ఆల్రెడీ షూట్ చేసిన దాంట్లో కూడా కొన్ని వరుణ్ కు నచ్చలేదు. అవి కూడా […]
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీ గని. వరుణ్ ఇందులో బాక్సర్ గా కనిపిస్తున్నాడు. సినిమా షూటింగ్
కూడా దాదాపు పూర్తయింది. మరో 20శాతం మాత్రం పెండింగ్ ఉంది. ఇలాంటి టైమ్ లో ఊహించని
విధంగా గని సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కొంత స్క్రిప్ట్ మార్చమని
వరుణ్ తేజ్ కోరాడంట. దీనికితోడు ఆల్రెడీ షూట్ చేసిన దాంట్లో కూడా కొన్ని వరుణ్ కు నచ్చలేదు. అవి
కూడా రీషూట్ చేయమని కోరాడంట. దానికి కిరణ్ నిరాకరించడంతో సినిమాకు అడ్డంకులు ఏర్పడినట్టు
తెలుస్తోంది.
సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయమౌతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, ఉపేంద్ర
కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాను జులై 30న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు.
కానీ ఇప్పుడా తేదీకి గని రాదు.