మరోసారి తెరపైకి సమంత పేరు
ప్రస్తుతం చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది సమంత. మరీ ముఖ్యంగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. ఇక స్టార్ హీరోల సరసన ఆమె గ్లామర్ రోల్స్ చేయదని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి టైమ్ లో వచ్చిన ఓ పుకారు ఇప్పుడు క్రేజీగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. మహేష్ సరసన మరోసారి సమంత నటిస్తుందట. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంతను హీరోయిన్ గా […]
ప్రస్తుతం చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది సమంత. మరీ ముఖ్యంగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు
చేస్తోంది. ఇక స్టార్ హీరోల సరసన ఆమె గ్లామర్ రోల్స్ చేయదని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి
టైమ్ లో వచ్చిన ఓ పుకారు ఇప్పుడు క్రేజీగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. మహేష్ సరసన మరోసారి
సమంత నటిస్తుందట.
త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో మహేష్
సరసన సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇదే కనుక నిజమైతే.. ఓ క్రేజీ
కాంబినేషన్ తెరపైకి వచ్చినట్టే.
అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ ఇద్దరితో సూపర్ హిట్స్ ఇచ్చింది సమంత. త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ,
సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో నటించింది. ఇక మహేష్ సరసన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, దూకుడు
లాంటి సినిమాలు చేసింది. సో.. ఇప్పుడు మహేష్-సమంత-త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తే ఆ కిక్కే వేరు.