అప్పుడు క్రాక్.. ఇప్పుడు ఖిలాడీ

సంక్రాంతి కానుకగా విడుదలైంది క్రాక్ సినిమా. అయితే ఆ సినిమా రిలీజ్ కు ముందు చాలా హైడ్రామా నడిచింది. ఆ సినిమా థియేటర్లలోకి రాదని కొందరు, వస్తుందని మరికొందరు వాదించుకున్నారు. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని క్రాక్ ను ఓటీటీకి ఇచ్చేయాలని నిర్మాత కూడా ఓ దశలో సిద్ధపడిపోయాడు. అయితే దర్శకుడు మాత్రం ఆ ప్రతిపాదనను ఆపేశాడు. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి రవితేజ నటించిన మరో సినిమాకు ఎదురైంది. ఈసారి ఖిలాడీ వంతు వచ్చింది. ఖిలాడీ […]

Advertisement
Update:2021-05-16 11:42 IST

సంక్రాంతి కానుకగా విడుదలైంది క్రాక్ సినిమా. అయితే ఆ సినిమా రిలీజ్ కు ముందు చాలా హైడ్రామా
నడిచింది. ఆ సినిమా థియేటర్లలోకి రాదని కొందరు, వస్తుందని మరికొందరు వాదించుకున్నారు. కరోనా
పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని క్రాక్ ను ఓటీటీకి ఇచ్చేయాలని నిర్మాత కూడా ఓ దశలో సిద్ధపడిపోయాడు.
అయితే దర్శకుడు మాత్రం ఆ ప్రతిపాదనను ఆపేశాడు.

ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి రవితేజ నటించిన మరో సినిమాకు ఎదురైంది. ఈసారి ఖిలాడీ వంతు
వచ్చింది. ఖిలాడీ రిలీజ్ టైమ్ కు సెకెండ్ వేవ్ వచ్చేసింది. దీంతో ఖిలాడీ సినిమాను ఓటీటీకి
ఇచ్చేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే నేరుగా ఓటీటీలో ఖిలాడీ రిలీజ్ అవుతుందంటూ
కథనాలు కూడా వచ్చేశాయి.

అయితే క్రాక్ టైమ్ లో ఉన్న సందిగ్దత ఇప్పుడు లేదు. ఈసారి మేకర్స్ స్పష్టమైన ప్రకటన చేశారు. తమ
సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వదని, థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడే వస్తుందని విస్పష్టంగా
ప్రకటించారు.

థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నా మార్కెట్ ఉంటుందని నిర్మాతలకు అర్థమైంది. జనాలు రారేమో అనే
అపోహల్ని జాతిరత్నాలు, ఉప్పెన లాంటి సినిమాలు పటాపంచలు చేశాయి. ఈ నమ్మకంతో ఓ మోస్తరు
బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇష్టపడడం లేదు.

Tags:    
Advertisement

Similar News