తెరపైకి యాక్షన్ హీరోల మల్టీస్టారర్?
టాలీవుడ్ లో గోపీచంద్ కు మంచి యాక్షన్ ఇమేజ్ ఉంది. ఇక సీనియర్ హీరో రాజశేఖర్ కు కూడా అదే ఇమేజ్ ఉంది. ఇలాంటి ఇద్దరు యాక్షన్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది దర్శకుడు శ్రీవాస్ కి. తను రాసుకున్న కథలో వీళ్లిద్దర్నీ హీరోలుగా పెట్టి సినిమా తీయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు ఈ డైరక్టర్. ఇద్దరు హీరోలకు కథ కూడా వినిపించాడట. గతంలో గోపీచంద్, జగపతిబాబు కాంబినేషన్ […]
టాలీవుడ్ లో గోపీచంద్ కు మంచి యాక్షన్ ఇమేజ్ ఉంది. ఇక సీనియర్ హీరో రాజశేఖర్ కు కూడా అదే
ఇమేజ్ ఉంది. ఇలాంటి ఇద్దరు యాక్షన్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే
ఆలోచన వచ్చింది దర్శకుడు శ్రీవాస్ కి. తను రాసుకున్న కథలో వీళ్లిద్దర్నీ హీరోలుగా పెట్టి సినిమా
తీయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు ఈ డైరక్టర్. ఇద్దరు హీరోలకు కథ కూడా వినిపించాడట.
గతంలో గోపీచంద్, జగపతిబాబు కాంబినేషన్ లో ‘లక్ష్యం’ అనే సినిమా డైరెక్ట్ చేశాడు శ్రీవాస్. మంచి
కథతో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు అలాంటి కథే
రాసుకొని గోపీచంద్, రాజశేఖర్ తో తీయాలనుకుంటున్నాడట ఈ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమాకు
సంబంధించి శ్రీవాస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టాడని సమాచారం.
ఇటు గోపీచంద్, అటు రాజశేఖర్ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ సిటీమార్ రిలీజ్
కు రెడీ అయింది. త్వరలోనే తేజ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవుతుంది. అటు రాజశేఖర్ చేతిలో కూడా 2 సినిమాలున్నాయి. శ్రీవాస్ కథకు ఓకే చెప్పినా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రావడానికి టైమ్ పట్టేలా ఉంది.