టాలీవుడ్ డైరెక్టర్ నంద్యాల రవి కన్నుమూత

కరోనా బారినపడి కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ రచయిత, దర్శకుడు నంద్యాల రవి ఇవాళ కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట రవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తూ వచ్చారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. కరోనా బారినపడ్డ రవి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా ఆయన హాస్పిటల్ బిల్లు రూ. 7 నుంచి 8 లక్షల వరకు రావడంతో ఆయన కుటుంబం […]

Advertisement
Update:2021-05-14 10:12 IST

కరోనా బారినపడి కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ రచయిత, దర్శకుడు నంద్యాల రవి ఇవాళ కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట రవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తూ వచ్చారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు.

కరోనా బారినపడ్డ రవి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా ఆయన హాస్పిటల్ బిల్లు రూ. 7 నుంచి 8 లక్షల వరకు రావడంతో ఆయన కుటుంబం అంత సొమ్ము చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి ప్రసాద్ ముందుకు వచ్చి రూ. లక్ష సాయం అందజేశాడు. అలాగే నిర్మాత రాధామోహన్ మరో రూ. లక్ష అందించారు.

చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న కరోనా క్రైసిస్ చారిటీ తరపున కూడా సాయం అందినట్లు తెలుస్తోంది. అయితే రెండు వారాలుగా చికిత్స పొందుతున్న నంద్యాల రవి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతిచెందాడు.

నాగశౌర్య, అవికాగోర్ జంటగా నటించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాకు రవి దర్శకత్వం వహించాడు. అలాగే ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే తదితర సినిమాలకు రచయితగా పనిచేశాడు. నంద్యాల రవి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News