9 కిలోలు బరువు పెరిగిన ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి చాలా విషయాలు ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టాడు హీరో ఎన్టీఆర్. ఓ హాలీవుడ్ పత్రికకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ కోసం తను పడిన కష్టాన్ని బయటపెట్టాడు. “ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా 18 నెలలు ట్రయినింగ్ తీసుకున్నాను. దీని కోసం ఓ ప్రత్యేకమైన ఫిజిక్ కావాలని రాజమౌళి కోరారు. అందుకే అంత కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమాకు కమిట్ అయ్యే టైమ్ లో నా […]
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి చాలా విషయాలు ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉన్నాయి. అయితే
ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టాడు హీరో ఎన్టీఆర్. ఓ హాలీవుడ్ పత్రికకు
ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ కోసం తను పడిన కష్టాన్ని బయటపెట్టాడు.
“ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా 18 నెలలు ట్రయినింగ్ తీసుకున్నాను. దీని కోసం ఓ ప్రత్యేకమైన ఫిజిక్
కావాలని రాజమౌళి కోరారు. అందుకే అంత కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమాకు కమిట్ అయ్యే టైమ్ లో
నా బరువు 71 కిలోలు. రాజమౌళి కోరిన మీదట మరో 9 కేజీలు పెరిగాను.”
లాక్ డౌన్ టైమ్ లో అదే బరువు, అదే ఫిజిక్ ను కొనసాగించడం చాలా కష్టంగా ఉందని.. అయినప్పటికీ
సినిమా కోసం కష్టపడక తప్పదని అంటున్నాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఇంతకంటే
ఎక్కువగా అప్ డేట్స్ ఇవ్వడం తనకు ఇష్టంలేదని, ఇంకా ఎక్కువ చెబితే గొడ్డలి పట్టుకొని రాజమౌళి
తనను వెంబడిస్తాడని సరదాగా జోక్ చేశాడు ఎన్టీఆర్.