వ్యాక్సిన్, ఆక్సిజన్ పై .. ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ..
వ్యాక్సిన్ లభ్యత, ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఆక్సిజన్ సరఫరా పెంచాలని, వ్యాక్సినేషన్ సులభతరం అయ్యే మార్గాలు అణ్వేషించాలని ఈ లేఖలో పేర్కొన్నారు జగన్. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రస్తుతం సరఫరా చేస్తున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏమాత్రం సరిపోవడం లేదని, 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలన్నారు. తమిళనాడు, కర్నాటక నుంచి ఆక్సిజన్ […]
వ్యాక్సిన్ లభ్యత, ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఆక్సిజన్ సరఫరా పెంచాలని, వ్యాక్సినేషన్ సులభతరం అయ్యే మార్గాలు అణ్వేషించాలని ఈ లేఖలో పేర్కొన్నారు జగన్. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రస్తుతం సరఫరా చేస్తున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏమాత్రం సరిపోవడం లేదని, 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలన్నారు. తమిళనాడు, కర్నాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నా అది సరిపోవడం లేదని చెప్పారు జగన్.
సీఎం జగన్ లేఖలో ముఖ్యాంశాలు..
– ఈనెల 10న తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యం కావడంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మంది కరోనా రోగులు చనిపోయారు.
– ప్రస్తుతం కర్నాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 150 మెట్రిక్ టన్నులకు పెంచాలి.
– ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోటాను 400 మెట్రిక్ టన్నులకు పెంచాలి.
– టీకాల సమస్య రాష్ట్రాన్ని వేధిస్తోంది, కొవాగ్జిన్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి.
– భారత్ బయోటెక్ తయారీ కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు, టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలి.
– పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి.
– టెక్నాలజీ బదిలీ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయొచ్చు.
– వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి, ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరిస్తామని మాటిచ్చాయి.
– ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి.