శృతిహాసన్ ఆర్థిక కష్టాలు

లీడింగ్ లో ఉన్న హీరోయిన్లకు కూడా ఆర్థిక కష్టాలుంటాయి. నెలవారీ ఈఏంఐలు కట్టుకోలేని పరిస్థితిలో హీరోయిన్లు ఉంటారా? మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా ఆఫర్లు అందుకున్న శృతిహాసన్ లాంటి హీరోయిన్ కు ఇలాంటి కష్టాలుంటాయా? కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. తను ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉన్నానంటోంది శృతిహాసన్. లాక్ డౌన్ కు ముందు ఓ ఇల్లు కొనుక్కున్నానని, ఆ అనాలోచిత నిర్ణయానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది శృతిహాసన్. షూటింగ్స్ […]

Advertisement
Update:2021-05-11 14:14 IST

లీడింగ్ లో ఉన్న హీరోయిన్లకు కూడా ఆర్థిక కష్టాలుంటాయి. నెలవారీ ఈఏంఐలు కట్టుకోలేని పరిస్థితిలో
హీరోయిన్లు ఉంటారా? మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా ఆఫర్లు అందుకున్న
శృతిహాసన్ లాంటి హీరోయిన్ కు ఇలాంటి కష్టాలుంటాయా? కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది
నిజం.

తను ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉన్నానంటోంది శృతిహాసన్. లాక్ డౌన్ కు ముందు ఓ ఇల్లు కొనుక్కున్నానని,
ఆ అనాలోచిత నిర్ణయానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది శృతిహాసన్. షూటింగ్స్
అన్నీ ఆగిపోవడంతో, రాబడి తగ్గిపోయిందని, అందువల్ల ముంబయిలో కొనుక్కున్న ఇంటికి ఈఎంఐ
కట్టడం కూడా కష్టంగా ఉందని బాధపడింది శృతిహాసన్.

అయితే ఈ విషయంలో ఎవ్వర్నీ నిందించనంటోంది శృతిహాసన్. తను తీసుకున్న నిర్ణయానికి తనే
బాధపడతానని, సొంతంగా పైకొస్తానని వివరణ ఇచ్చుకుంది. ఈ విషయంలో తన తల్లి లేదా తండ్రి కమల్
హాసన్ సహాయాన్ని కోరనని, తనే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటకొస్తానని చెప్పుకొచ్చింది శృతిహాసన్.

Tags:    
Advertisement

Similar News