మహిళా దర్శకురాలితో ప్రభాస్ మూవీ

ఈ కరోనా టైమ్ లో షూటింగ్ లేకపోయినా ప్రభాస్ ఖాళీగా మాత్రం లేడు. ఓవైపు ఫ్రీ టైమ్ ఎంజాయ్ చేస్తునే, మరోవైపు కొత్త కథలు వింటున్నాడు. ఇందులో భాగంగా సుధా కొంగర చెప్పిన స్టోరీలైన్ కూడా విన్నాడట యంగ్ రెబల్ స్టార్. ఆ స్టోరీ ప్రభాస్ కు చాలా బాగా నచ్చిందట. అంతకుమించి ఈ సినిమాపై ఎలాంటి ప్రకటన లేదు. అప్ డేట్ రాలేదు సుధా కొంగర, ప్రభాస్ మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయనేది వాస్తవం. అయితే […]

Advertisement
Update:2021-05-10 14:44 IST

ఈ కరోనా టైమ్ లో షూటింగ్ లేకపోయినా ప్రభాస్ ఖాళీగా మాత్రం లేడు. ఓవైపు ఫ్రీ టైమ్ ఎంజాయ్
చేస్తునే, మరోవైపు కొత్త కథలు వింటున్నాడు. ఇందులో భాగంగా సుధా కొంగర చెప్పిన స్టోరీలైన్ కూడా
విన్నాడట యంగ్ రెబల్ స్టార్. ఆ స్టోరీ ప్రభాస్ కు చాలా బాగా నచ్చిందట. అంతకుమించి ఈ సినిమాపై
ఎలాంటి ప్రకటన లేదు. అప్ డేట్ రాలేదు

సుధా కొంగర, ప్రభాస్ మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయనేది వాస్తవం. అయితే ఆ చర్చలు ఏ రేంజ్ వరకు
వెళ్లాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే, ఇప్పటికే ఇద్దరు దర్శకులు చెప్పిన కథలు విన్నాడు
ప్రభాస్. అదే కోవలో సుధా కొంగర కథ కూడా విన్నాడు. తన అభిప్రాయం మాత్రం చెప్పలేదు.

పైగా ఇప్పటికిప్పుడు సినిమా ఓకే చేసినా సెట్స్ పైకి మాత్రం రాదు. ఎందుకంటే, ప్రభాస్ ఇంకా
రాధేశ్యామ్ పూర్తిచేయలేదు. మరోవైపు సెట్స్ పై ఆదిపురుష్, సలార్ సినిమాలున్నాయి. అవి పూర్తయిన
తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయాలి. ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి కనీసం రెండేళ్లు
పడుతుంది. ఈలోగా ఈ ప్రాజెక్టు ఏమౌతుందనేది ప్రశ్నార్థకం.

Tags:    
Advertisement

Similar News