కామెడీ సినిమాకు సీక్వెల్ సిద్ధం

వేసవి కానుకగా వచ్చిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్టయింది. పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభం తెచ్చిపెట్టింది. అంతలా కాసుల వర్షం కురిపించిన ఈ కామెడీ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉంది స్వప్న సినిమాస్ బ్యానర్. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు అనుదీప్ కు సమాచారం ఇవ్వడం, అతడు సీక్వెల్ వర్క్ స్టార్ట్ చేయడం అన్నీ జరిగిపోయాయి. జాతిరత్నాలు సినిమాలో తను రాసిన కామెడీ క్లిక్ అవ్వడంతో, ఇప్పుడు అదే పాట్రన్ లో మరో స్క్రిప్ట్ రెడీ […]

Advertisement
Update:2021-05-08 14:23 IST

వేసవి కానుకగా వచ్చిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్టయింది. పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభం తెచ్చిపెట్టింది. అంతలా కాసుల వర్షం కురిపించిన ఈ కామెడీ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉంది స్వప్న సినిమాస్ బ్యానర్. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు అనుదీప్ కు సమాచారం ఇవ్వడం, అతడు సీక్వెల్ వర్క్ స్టార్ట్ చేయడం అన్నీ జరిగిపోయాయి.

జాతిరత్నాలు సినిమాలో తను రాసిన కామెడీ క్లిక్ అవ్వడంతో, ఇప్పుడు అదే పాట్రన్ లో మరో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అనుదీప్. జాతిరత్నాలుగా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు, వాటి స్వభావాలు ఏంటనేది ఆల్రెడీ ఆడియన్స్ కు రీచ్ అయిపోయింది కాబట్టి.. అవే క్యారెక్టర్స్ ను రిపీట్ చేస్తూ.. మరో కొత్త బ్యాక్ డ్రాప్ లో కథ రాస్తున్నాడు అనుదీప్.

జాతిరత్నాలు సినిమాను జోగిపేట్ అనే ఊరిలో స్టార్ట్ చేసి, అదే ఊరిలో ముగించాడు దర్శకుడు. హీరో నవీన్, మ్యాచింగ్ అండ్ బ్యాంగిల్ సెంటర్ లో సెటిలవ్వడంతో సినిమాను ముగిస్తాడు. సీక్వెల్ ను కూడా అక్కడ్నుంచే స్టార్ట్ చేస్తున్నాడట దర్శకుడు. జాతిరత్నాలు సినిమాలో హిలేరియస్ గా పండిన కోర్టు డ్రామాను సీక్వెల్ లో కూడా కొనసాగించబోతున్నాడని టాక్.

Tags:    
Advertisement

Similar News