రానాను ఇంటర్వ్యూ చేసిన రకుల్
బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా వచ్చేస్తాయి. రకుల్-రానా మాట్లాడుకుంటే అలానే ఉంటుంది. కలిసి సినిమా చేయకపోయినా వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. పైగా వీళ్లకు కామన్ ఫ్రెండ్ గా మంచు లక్ష్మి ఉండడంతో.. వీళ్లు ముగ్గురు ఓ చిన్న గ్యాంగ్ గా తయారయ్యారు. ఆ చనువుతో రకుల్ ను తను చేస్తున్న కార్యక్రమానికి గెస్ట్ గా పిలిచాడు రానా. రకుల్ కూడా పిలిచిన వెంటనే వచ్చింది. కానీ చిన్న […]
బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా వచ్చేస్తాయి. రకుల్-రానా మాట్లాడుకుంటే అలానే ఉంటుంది. కలిసి సినిమా చేయకపోయినా వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. పైగా వీళ్లకు కామన్ ఫ్రెండ్ గా మంచు లక్ష్మి ఉండడంతో.. వీళ్లు ముగ్గురు ఓ చిన్న గ్యాంగ్ గా తయారయ్యారు.
ఆ చనువుతో రకుల్ ను తను చేస్తున్న కార్యక్రమానికి గెస్ట్ గా పిలిచాడు రానా. రకుల్ కూడా పిలిచిన వెంటనే వచ్చింది. కానీ చిన్న షాక్ ఇచ్చింది. రానాను గెస్ట్ సీట్ లో కూర్చోబెట్టి, తను హోస్ట్ అయిపోయింది. ప్రశ్నలు అడగాల్సిన రానానే ప్రశ్నలతో తెగ ఇబ్బంది పెట్టేసింది.
రానా నంబర్ వన్ యారీ కొత్త సీజన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ కోసం రకుల్-మంచు లక్ష్మిని పిలిస్తే.. ఇలా రివర్స్ లో రానానే గెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో రానాకు చెందిన ఎన్నో వ్యక్తిగత విషయాల్ని రకుల్ బయటకు కక్కించింది. ఓ సీక్రెట్ ప్లేస్ లో రానాకు ఓ పచ్చబొట్టు ఉంది. పెళ్లి తర్వాత ఆ పచ్చబొట్టు ను చెరిపేసుకోవాలని రానా తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాన్ని రకుల్ బయటపెట్టేసింది. ఇంతకీ ఆ పచ్చబొట్టులో పేరు ఎవరిదనే విషయాన్ని మాత్రం ఇద్దరూ చెప్పలేదు.