పూజా హెగ్డే మరోసారి ఫిక్స్ అయింది
అంతా ఊహించినట్టే జరిగింది. త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే మరోసారి హీరోయిన్ గా లాక్ అయింది. ఈ మేరకు సంప్రదింపులు పూర్తయ్యాయి. సంతకాలు మిగిలాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో నిన్న సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్. అరవింద సమేత సినిమా నుంచి వీళ్లిద్దరూ కలిశారు. ఆ తర్వాత పూజా యాక్టింగ్ నచ్చి, అల వైకుంఠపురములో సినిమాలో కూడా కంటిన్యూ చేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు […]
అంతా ఊహించినట్టే జరిగింది. త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే మరోసారి హీరోయిన్ గా లాక్ అయింది. ఈ
మేరకు సంప్రదింపులు పూర్తయ్యాయి. సంతకాలు మిగిలాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో నిన్న
సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు
త్రివిక్రమ్.
అరవింద సమేత సినిమా నుంచి వీళ్లిద్దరూ కలిశారు. ఆ తర్వాత పూజా యాక్టింగ్ నచ్చి, అల
వైకుంఠపురములో సినిమాలో కూడా కంటిన్యూ చేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు మహేష్ బాబు మూవీలో కూడా
ఆమెనే కొనసాగించబోతున్నాడు. సెప్టెంబర్ నుంచి కాల్షీట్లు రెడీగా ఉంచుకోమని పూజాకు చెప్పాడట
త్రివిక్రమ్. దానికి పూజాహెగ్డే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్
అంతా దాదాపు మహేష్ మూవీకి కూడా రిపీట్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి కథకు
ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు దశలవారీగా
బయటకు రాబోతున్నాయి.