మహేష్ నుంచి ప్రకటన వచ్చేసింది

అంతా ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. మహేష్-త్రివిక్రమ్ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ఈరోజే ప్రకటించారు. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలిసి ఈ సినిమా చేయబోతున్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేశారు. ఖలేజా ఫ్లాప్ అయిన టైమ్ లో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి. […]

Advertisement
Update:2021-05-01 14:39 IST

అంతా ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. మహేష్-త్రివిక్రమ్ సినిమాను అధికారికంగా
ప్రకటించారు మేకర్స్. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్
ఎట్రాక్షన్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ఈరోజే ప్రకటించారు.

దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలిసి ఈ సినిమా చేయబోతున్నారు. గతంలో
వీళ్లిద్దరూ కలిసి అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేశారు. ఖలేజా ఫ్లాప్ అయిన టైమ్ లో ఇద్దరి మధ్య
అభిప్రాయబేధాలొచ్చాయి. అప్పట్నుంచి కలిసి సినిమా చేయలేదు.

ఎప్పుడైతే అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందో మహేష్ భార్య నమ్రత సీన్ లోకి
ఎంటరైంది. మహేష్-త్రివిక్రమ్ ను కలిపింది. ప్రాజెక్టు సెట్ అయ్యేలా చేసింది. అలా 11 ఏళ్ల తర్వాత
వీళ్లిద్దరూ కలిశారు. సర్కారువారి పాట సినిమా పూర్తయిన వెంటనే ఈ మూవీ సెట్స్ పైకి వస్తుంది.

Tags:    
Advertisement

Similar News