మరో హారర్ సినిమాలో కాజల్

15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న కాజల్, ఇప్పటికీ తనకంటూ కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ వస్తోంది. మరీ ముఖ్యంగా పారితోషికం తగ్గించకుండా ఆమె ఛాన్సులు కొడుతోంది. ఇందులో భాగంగా మరో ప్రాజెక్టుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే చెప్పడమే కాదు.. ఏకంగా తన పోర్షన్ షూటింగ్ కూడా పూర్తిచేసింది. డీకే దర్శకత్వంలో ఓ హారర్ సినిమా చేసింది కాజల్. ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో కాజల్ తో పాటు రెజీనా, […]

Advertisement
Update:2021-05-01 14:37 IST

15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న కాజల్, ఇప్పటికీ తనకంటూ కొన్ని అవకాశాలు
అందిపుచ్చుకుంటూ వస్తోంది. మరీ ముఖ్యంగా పారితోషికం తగ్గించకుండా ఆమె ఛాన్సులు కొడుతోంది.
ఇందులో భాగంగా మరో ప్రాజెక్టుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే చెప్పడమే కాదు.. ఏకంగా తన పోర్షన్
షూటింగ్ కూడా పూర్తిచేసింది.

డీకే దర్శకత్వంలో ఓ హారర్ సినిమా చేసింది కాజల్. ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఈ సినిమా షూటింగ్
పూర్తయింది. ఇందులో కాజల్ తో పాటు రెజీనా, రైజా విల్సన్, జననీ లాంటి మరో ముగ్గురు హీరోయిన్లు
కూడా నటించారు.

ఈ ప్రాజెక్టు సంగతి పక్కనపెడితే.. ఇకపై హారర్ సినిమాలు చేయనని గతంలో ప్రకటించింది కాజల్. కెరీర్
లో ఆమె చేసిన ఒకే ఒక హారర్ ప్రాజెక్టు లైవ్ టెలికాస్ట్. అది కూడా వెబ్ సిరీస్. దాని తర్వాత మళ్లీ హారర్
చేయనని చెప్పిన కాజల్.. ఇప్పుడిలా డీకే దర్శకత్వంలో హారర్ సినిమాలో నటించింది.

Tags:    
Advertisement

Similar News