అఖండ ఎందుకు స్పందించట్లేదు
మే నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటనలు కూడా వచ్చేస్తున్నాయి. మరి బాలకృష్ణ నుంచి ఎఁదుకు ప్రకటన రావడం లేదు. అఖండ సినిమా వాయిదా పడినట్టు ఎందుకు చెప్పడం లేదు? ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రకటించిన డేట్ కి బడా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం లేదు. మే నెలలో రిలీజ్ అవ్వాల్సిన మెగాస్టార్ ‘ఆచార్య, వెంకటేష్ ‘నారప్ప’ సినిమాలు కూడా తాజాగా విడుదల వాయిదా పడ్డాయి. కరోన సెకండ్ వేవ్ […]
మే నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటనలు
కూడా వచ్చేస్తున్నాయి. మరి బాలకృష్ణ నుంచి ఎఁదుకు ప్రకటన రావడం లేదు. అఖండ సినిమా వాయిదా
పడినట్టు ఎందుకు చెప్పడం లేదు?
ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రకటించిన డేట్ కి బడా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం లేదు. మే నెలలో
రిలీజ్ అవ్వాల్సిన మెగాస్టార్ ‘ఆచార్య, వెంకటేష్ ‘నారప్ప’ సినిమాలు కూడా తాజాగా విడుదల వాయిదా
పడ్డాయి. కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నామని త్వరలో మళ్ళీ కొత్త డేట్
ఎనౌన్స్ చేస్తామని అటు ‘ఆచార్య’ మేకర్స్ ఇటు ‘నారప్ప’ మేకర్స్ చెప్పేశారు.
ఇక ఈ రెండు సినిమాలతో పాటే మే నెలలో విడుదల అంటూ బాలయ్య అఖండ ని కూడా ఎనౌన్స్
చేశారు. అయితే పోస్ట్ పోన్ పై మాత్రం ప్రకటన రాలేదు. దీంతో బాలయ్య సినిమా వచ్చే నెల వస్తుందా ?
లేదా అనే డైలమాలో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్.
బాలయ్య ‘అఖండ’కి సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తయింది. అయినంత వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్
కూడా జరిగిపోతుంది. సో.. సినిమా అయితే రెడీగానే ఉంది. కానీ వచ్చే నెల సినిమా విడుదల కావడం
కష్టమే. జూన్ లేదా జులైలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.