కరోనా నుంచి కోలుకున్న దర్శకుడు

అనీల్ రావిపూడి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సోకిన టైమ్ లో రావిపూడి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో కొంతమందికి అదింకా అనుమానంగానే మిగిలిపోయింది. అయితే ఈసారి మాత్రం రావిపూడి నుంచి ప్రకటన వచ్చింది. కరోనా తగ్గిన తర్వాత ఆయన ప్రకటన చేయడం విశేషం. ఏప్రిల్ 13న తనకు కరోనా సోకిందని చెప్పుకొచ్చిన బండ్ల, అప్పట్నుంచి తను ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానని, వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడి పూర్తిగా కోలుకున్నానని తెలిపాడు. […]

Advertisement
Update:2021-04-28 14:59 IST

అనీల్ రావిపూడి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సోకిన టైమ్ లో రావిపూడి స్టేట్
మెంట్ ఇవ్వలేదు. దీంతో కొంతమందికి అదింకా అనుమానంగానే మిగిలిపోయింది. అయితే ఈసారి
మాత్రం రావిపూడి నుంచి ప్రకటన వచ్చింది. కరోనా తగ్గిన తర్వాత ఆయన ప్రకటన చేయడం విశేషం.

ఏప్రిల్ 13న తనకు కరోనా సోకిందని చెప్పుకొచ్చిన బండ్ల, అప్పట్నుంచి తను ఐసొలేషన్ లోకి
వెళ్లిపోయానని, వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడి పూర్తిగా కోలుకున్నానని తెలిపాడు. అయితే
వైరస్ వచ్చిన వెంటనే చెప్పకపోవడం చాలా ప్రమాదం అంటూ రావిపూడిపై అప్పట్లో విమర్శలు
చెలరేగాయి.

వాటికి కౌంటర్ గా స్పందించాడు అనీల్ రావిపూడి. తనకు వైరస్ సోకిన వెంటనే.. ఆ టైమ్ లో తనతో టచ్
లోకి వచ్చిన వాళ్లందరికీ తను వ్యక్తిగతంగా ఫోన్ చేశానని, విధిగా కరోనా పరీక్షలు చేయించుకోమని
కోరానంటూ తన ప్రకటనలో వివరణ ఇచ్చుకున్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసిన ఈ
దర్శకుడు.. తన ఆరోగ్యంపై వాకబు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

Tags:    
Advertisement

Similar News