ఓటీటీలోకి వకీల్ సాబ్

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. నైజాంలో కరోనా వల్ల థియేటర్లు మూతపడ్డం, ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో వకీల్ సాబ్ సినిమా క్లోజింగ్ కు వచ్చింది. దీంతో ఇప్పుడీ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇచ్చేశారు. ఈనెల 30 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వకీల్ సాబ్ ను చూడొచ్చు. థియేటర్లలో మళ్లీ మళ్లీ వకీల్ సాబ్ […]

Advertisement
Update:2021-04-27 13:43 IST

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
నైజాంలో కరోనా వల్ల థియేటర్లు మూతపడ్డం, ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన ఉన్నప్పటికీ
ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో వకీల్ సాబ్ సినిమా క్లోజింగ్ కు వచ్చింది. దీంతో ఇప్పుడీ సినిమాను
ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇచ్చేశారు. ఈనెల 30 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వకీల్ సాబ్ ను
చూడొచ్చు.

థియేటర్లలో మళ్లీ మళ్లీ వకీల్ సాబ్ చూడలేకపోతున్న పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది శుభవార్తే.
కాకపోతే దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయంపై మిగతా వర్గాలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
టాలీవుడ్ లో ఓ నిబంధన ఉంది. ఏ సినిమానైనా థియేటర్లలో రిలీజ్ చేసిన 8 వారాల్లోపు ఓటీటీకి
ఇవ్వకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘించి జస్ట్ 3 వారాల్లోనే వకీల్ సాబ్ ను ఓటీటీకి ఇచ్చేశాడు దిల్
రాజు.

ఇక్కడే దిల్ రాజు మరో విమర్శ కూడా ఎదుర్కొన్నాడు. ఈ నెలాఖరుకు వకీల్ సాబ్ సినిమా అమెజాన్ లో
రాబోతోందంటూ గతంలోనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని దిల్ రాజు స్వయంగా తిప్పికొట్టాడు. తమ
సినిమాను థియేటర్లలో చూస్తేనే మజా అంటూ కబుర్లు చెప్పాడు. కట్ చేస్తే, ఆ ఊహాగానాల్ని నిజం చేస్తూ,
ఇప్పుడు నిజంగానే సినిమాను స్ట్రీమింగ్ కు ఇచ్చేశాడు. దీంతో దిల్ రాజుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో
ట్రోలింగ్ నడుస్తోంది.

Tags:    
Advertisement

Similar News