మరోసారి ఓటీటీకి గిరాకీ

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ పరిస్థితులు వచ్చేశాయి. ప్రైవేటు ఉద్యోగుల్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కు మారిపోయారు. థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో ఓటీటీకి మరోసారి గిరాకీ పెరిగింది. రిలీజెస్ ఆగిపోవడంతో చిన్న సినిమా నిర్మాతలంతా తమ సినిమాల్ని ఓటీటీకి ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నారు. ఇందులో భాగంగా అనసూయ నటించిన ఓ సినిమా వచ్చే నెల నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. దీంతో పాటు మరిన్ని సినిమాలు ఇప్పుడు ఎంక్వైరీలు మొదలుపెట్టాయి. రాబోయే 2-3 నెలల్లో మరిన్ని […]

Advertisement
Update:2021-04-26 15:29 IST

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ పరిస్థితులు వచ్చేశాయి. ప్రైవేటు ఉద్యోగుల్లో చాలామంది వర్క్
ఫ్రమ్ హోమ్ కు మారిపోయారు. థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో ఓటీటీకి మరోసారి గిరాకీ పెరిగింది.
రిలీజెస్ ఆగిపోవడంతో చిన్న సినిమా నిర్మాతలంతా తమ సినిమాల్ని ఓటీటీకి ఇవ్వడానికి
మొగ్గుచూపుతున్నారు.

ఇందులో భాగంగా అనసూయ నటించిన ఓ సినిమా వచ్చే నెల నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. దీంతో పాటు మరిన్ని సినిమాలు ఇప్పుడు ఎంక్వైరీలు మొదలుపెట్టాయి. రాబోయే 2-3 నెలల్లో మరిన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతాయని స్వయంగా ఆ సంస్థలే ప్రకటనలు గుప్పిస్తున్నాయి.

గతేడాది లాక్ డౌన్ టైమ్ లో సూర్య, అనుష్క, నాని లాంటి తారలు నటించిన సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజయ్యాయి. ఈసారి పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ కాకుండా నిలిచిపోయాయి. ఇంకా చెప్పాలంటే చిన్న హీరోల నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమా వరకు ప్రతి హీరో సినిమా దాదాపు సిద్ధంగా ఉంది. వీటిలో ఏవి ఓటీటీకి వస్తాయో చూడాలి.

Tags:    
Advertisement

Similar News