హీరోయిన్ పై పవన్ కవితలు
పవన్ కల్యాణ్ పుస్తకాలు చదువుతారని అందరికీ తెలుసు. కానీ ఆయన కవితలు రాస్తారా? మరీ ముఖ్యంగా హీరోయిన్లపై పవన్ కవితలు రాస్తారా? రాస్తారనే చెబుతోంది సీనియర్ నటి జ్యోతి. తనపై పవన్ కల్యాణ్ కవితలు రాశారని జ్యోతి చెబుతోంది. గతంలో పవన్ కల్యాణ్, జ్యోతి కలిసి ఓ సినిమా చేశారు. ఆ సినిమా టైమ్ లో జ్యోతి వాలుజడ, ఆమె ఓర చూపుపై పవన్ కల్యాణ్ కవితలు రాసేవారట. జ్యోతిని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నించేవారట. అయితే […]
పవన్ కల్యాణ్ పుస్తకాలు చదువుతారని అందరికీ తెలుసు. కానీ ఆయన కవితలు రాస్తారా? మరీ ముఖ్యంగా
హీరోయిన్లపై పవన్ కవితలు రాస్తారా? రాస్తారనే చెబుతోంది సీనియర్ నటి జ్యోతి. తనపై పవన్ కల్యాణ్
కవితలు రాశారని జ్యోతి చెబుతోంది.
గతంలో పవన్ కల్యాణ్, జ్యోతి కలిసి ఓ సినిమా చేశారు. ఆ సినిమా టైమ్ లో జ్యోతి వాలుజడ, ఆమె ఓర
చూపుపై పవన్ కల్యాణ్ కవితలు రాసేవారట. జ్యోతిని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నించేవారట.
అయితే అదంతా సరదాగానే జరిగిందని, సెట్స్ లో తనను ఆటపట్టించడం కోసం పవన్ తో పాటు
చాలామంది అలా చేసేవారని చెప్పుకొచ్చింది జ్యోతి. ఇప్పుడు మరోసారి పవన్ కల్యాణ్ తో కలిసి
నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది.