ఇలియానా అంటే పిచ్చి

హీరో విశ్వక్ సేన్ తన మనసులో మాట బయటపెట్టాడు. చిన్నప్పట్నుంచి హీరోయిన్ ఇలియానా అంటే తనకు చాలా ఇష్టమనే విషయాన్ని వెల్లడించాడు. ఇలియానా అంటే ఎంతిష్టమంటే.. చిన్నప్పట్నుంచి ఇప్పటివరకు ఇలియానానే తన ఫస్ట్ క్రష్ అంటున్నాడు విశ్వక్. అంటే.. ఇలియానా రేంజ్ లో ఇప్పటివరకు మరో అమ్మాయి తనకు నచ్చలేదంటున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విశ్వక్. అతడు నటించిన పాగల్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. కానీ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా […]

Advertisement
Update:2021-04-25 15:46 IST

హీరో విశ్వక్ సేన్ తన మనసులో మాట బయటపెట్టాడు. చిన్నప్పట్నుంచి హీరోయిన్ ఇలియానా అంటే తనకు చాలా ఇష్టమనే విషయాన్ని వెల్లడించాడు. ఇలియానా అంటే ఎంతిష్టమంటే.. చిన్నప్పట్నుంచి ఇప్పటివరకు ఇలియానానే తన ఫస్ట్ క్రష్ అంటున్నాడు విశ్వక్. అంటే.. ఇలియానా రేంజ్ లో ఇప్పటివరకు మరో అమ్మాయి తనకు నచ్చలేదంటున్నాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విశ్వక్. అతడు నటించిన పాగల్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. కానీ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దీంతో పాగల్ ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేయకుండా ఆపేశారు. ఈ సినిమాతో పాటు ఓ రీమేక్ ప్రాజెక్టులో కూడా నటిస్తున్నాడు విశ్వక్.

ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈ హీరో, ఖాళీ టైమ్ లో సోషల్ మీడియాలో ఛాట్ చేశాడు. ఈ సందర్భంగా తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఇలియానా అనే విషయాన్ని బయటపెట్టాడు. మరోవైపు పెళ్లి సంగతేంటంటూ అభిమానులు ప్రశ్నించగా.. మంచి సంబంధం ఉంటే చూడమంటూ వాళ్లకే తన పెళ్లి పని అప్పగించాడు ఈ హీరో.

Tags:    
Advertisement

Similar News