పొట్టి వీరయ్య కన్నుమూత
సీనియర్ సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరయ్య, ఈరోజు గుండెపోటుతో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. పొట్టి వీరయ్య వయసు 74 సంవత్సరాలు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. ఇండస్ట్రీలో ఆయన చాలా సీనియర్. 500కు పైగా సినిమాల్లో నటించారు. అప్పుడెప్పుడో విఠలాచార్య తీసిన అగ్గిదొర అనే సినిమాతో మరుగుజ్జు పాత్రతో వీరయ్య సినీప్రవేశం జరిగింది. అందరూ శాపంగా భావించే మరుగుజ్జుతనమే ఆయనకు వరంగా మారింది. […]
సీనియర్ సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరయ్య, ఈరోజు గుండెపోటుతో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. పొట్టి వీరయ్య వయసు 74 సంవత్సరాలు.
పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. ఇండస్ట్రీలో ఆయన చాలా సీనియర్. 500కు పైగా సినిమాల్లో నటించారు. అప్పుడెప్పుడో విఠలాచార్య తీసిన అగ్గిదొర అనే సినిమాతో మరుగుజ్జు పాత్రతో వీరయ్య సినీప్రవేశం జరిగింది. అందరూ శాపంగా భావించే మరుగుజ్జుతనమే ఆయనకు వరంగా మారింది.
నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో జన్మించారు వీరయ్య. హైస్కూల్ వరకు చదువుకున్నారు. చిన్నప్పట్నుంచే నాటకాలు వేశారు. ఆ ఆసక్తితోనే సినిమా రంగంలోకి వచ్చారు. శోభన్ బాబు సిఫార్స్ తో విఠలాచార్య సినిమాలో తొలి అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత పరిశ్రమలో దాసరి నారాయణరావు, రాజబాబు వీరయ్యను బాగా ప్రోత్సహించారు. తెలుగులో దాదాపు అగ్రహీరోలందరితో నటించారు వీరయ్య.