దృశ్యంపై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు
సినిమాలు జెట్ స్పీడులో పూర్తవ్వడమే ఆలస్యం, పుకార్లు అలా స్టార్ట్ అయిపోతున్నాయి. సదరు సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ కథనాలు వచ్చేస్తున్నాయి. తాజాగా వెంకటేష్ ‘దృశ్యం 2’ సినిమా చుట్టూ కూడా ఇలాంటి వార్తలే తిరిగాయి. ఈమధ్యే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశాడు వెంకీ. అంతే, ఆ వెంటనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దృశ్యం-2 నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిపోతుందంటూ ప్రచారం మొదలైంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత సురేష్ బాబు. సినిమా డైరక్ట్ […]
సినిమాలు జెట్ స్పీడులో పూర్తవ్వడమే ఆలస్యం, పుకార్లు అలా స్టార్ట్ అయిపోతున్నాయి. సదరు సినిమాను
ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ కథనాలు వచ్చేస్తున్నాయి. తాజాగా వెంకటేష్ ‘దృశ్యం 2’ సినిమా
చుట్టూ కూడా ఇలాంటి వార్తలే తిరిగాయి. ఈమధ్యే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశాడు వెంకీ. అంతే, ఆ
వెంటనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దృశ్యం-2 నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిపోతుందంటూ ప్రచారం
మొదలైంది.
తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత సురేష్ బాబు. సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ
వస్తున్న వార్తలో నిజంలేదని తేల్చి చెప్పారు. ఇది థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అంటూ చెప్పిన
సురేష్ బాబు, సినిమా ముందు థియేటర్ రిలీజ్ ఉంటుందని ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని తాజాగా ఓ
మీడియా సంస్థతో చెప్పారు.
దృశ్యం2 మలయాళం వెర్షన్ నేరుగా ఓటీటీలో రిలీజైంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ
సినిమా అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే వెంటనే తెలుగు రీమేక్ స్టార్ట్ చేశాడు వెంకీ.