చిరంజీవితో మహేష్ డైరక్టర్
చిరంజీవి అస్సలు ఖాళీగా లేరు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. తను చేయబోయే సినిమాలేంటనేవి కూడా క్లియర్ గా చెప్పేశారు. కాస్త ముందువెనక అవుతాయి తప్ప, ఆయన ప్రకటించిన సినిమాలన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి టైమ్ లో చిరంజీవి మరో సినిమా టేకప్ చేస్తారా? కొత్త కథలు వింటారా? సరిగ్గా ఇక్కడే ఓ కొత్త పుకారు పుట్టుకొచ్చింది. చిరంజీవికి తాజాగా వంశీ పైడిపల్లి ఓ కథ చెప్పాడట. సామాజిక సందేశంతో పాటు హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే కథ […]
చిరంజీవి అస్సలు ఖాళీగా లేరు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. తను చేయబోయే సినిమాలేంటనేవి
కూడా క్లియర్ గా చెప్పేశారు. కాస్త ముందువెనక అవుతాయి తప్ప, ఆయన ప్రకటించిన సినిమాలన్నీ
వచ్చేస్తాయి. ఇలాంటి టైమ్ లో చిరంజీవి మరో సినిమా టేకప్ చేస్తారా? కొత్త కథలు వింటారా? సరిగ్గా
ఇక్కడే ఓ కొత్త పుకారు పుట్టుకొచ్చింది.
చిరంజీవికి తాజాగా వంశీ పైడిపల్లి ఓ కథ చెప్పాడట. సామాజిక సందేశంతో పాటు హీరోయిజం, మాస్
ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే కథ అట. ఆ స్టోరీలైన్ చిరంజీవికి బాగా నచ్చి డెవలప్ చేయమని
చెప్పారట. ఇది ప్రస్తుతం నడుస్తున్న రూమర్. ఇందులో నిజం ఎంతో తెలీదు కానీ, ఓకే అయితే మాత్రం
సెట్స్ పైకి రావడానికి కనీసం మూడేళ్లు పడుతుంది.
అవును.. ప్రస్తుతం ఆచార్య పనిమీద ఉన్నారు చిరంజీవి. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ స్టార్ట్ చేయాలి. ఆ
తర్వాత బాబి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ వచ్చి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే వంశీ పైడిపల్లికి ఛాన్స్.