రూటు మార్చిన రావిపూడి
అన్నీ అనుకున్నట్టు జరిగితే అనీల్ రావిపూడి తన నెక్ట్స్ సినిమాను మహేష్ బాబుతో చేయాలి. కానీ మధ్యలో త్రివిక్రమ్ దూరడంతో అనీల్ రావిపూడికి దెబ్బ పడింది. అనీల్ ప్రాజెక్టును పక్కనపెట్టిన మహేష్, త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రావిపూడి రూటు మార్చాడు. మహేష్ బాబు ప్రాజెక్టు పట్టాలపైకి రాకపోవడంతో మరోసారి బాలయ్యవైపు వచ్చాడు అనీల్ రావిపూడి. బాలయ్య-రావిపూడి మధ్య గతంలోనే చర్చలు జరిగాయి. ఎఫ్2 కంటే ముందు బాలయ్య కోసం రామారావు గారు అనే […]
అన్నీ అనుకున్నట్టు జరిగితే అనీల్ రావిపూడి తన నెక్ట్స్ సినిమాను మహేష్ బాబుతో చేయాలి. కానీ
మధ్యలో త్రివిక్రమ్ దూరడంతో అనీల్ రావిపూడికి దెబ్బ పడింది. అనీల్ ప్రాజెక్టును పక్కనపెట్టిన మహేష్,
త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రావిపూడి రూటు మార్చాడు.
మహేష్ బాబు ప్రాజెక్టు పట్టాలపైకి రాకపోవడంతో మరోసారి బాలయ్యవైపు వచ్చాడు అనీల్ రావిపూడి.
బాలయ్య-రావిపూడి మధ్య గతంలోనే చర్చలు జరిగాయి. ఎఫ్2 కంటే ముందు బాలయ్య కోసం రామారావు
గారు అనే కథ వినిపించాడు రావిపూడి. కానీ ఎందుకో బాలయ్య దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
తాజాగా మరోసారి బాలయ్యతో చర్చలు ప్రారంభించాడు రావిపూడి. మరో కొత్త కథ వినిపించాడు. ఈసారి
బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ దాదాపు వచ్చేసింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.
అయితే బాలయ్య ఓకే చెప్పినప్పటికీ ఈ ప్రాజెక్టు వెంటనే సెట్స్ పైకి రాదు. ఎందుకంటే, అఖండ
తర్వాత గోపీచంద్ మలినేనికి కాల్షీట్లు ఇచ్చాడు బాలయ్య. ఆ సినిమా కూడా పూర్తయిన తర్వాత అనీల్
రావిపూడితో సినిమా ఉంటుంది. ఈలోగా ఎఫ్3 మూవీ పూర్తిచేస్తాడు అనీల్.