18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్​..!

దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్​ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్​ మూడో దశ వ్యాక్సినేషన్​ విస్తృతంగా చేపట్టబోతున్నట్టు పేర్కొన్నది. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు.. ఇక నుంచి తాము తయారు చేసిన డోసుల్లో 50 శాతం కేంద్రానికి ఇవ్వాల్సి […]

Advertisement
Update:2021-04-19 15:58 IST

దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్​ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్​ మూడో దశ వ్యాక్సినేషన్​ విస్తృతంగా చేపట్టబోతున్నట్టు పేర్కొన్నది.

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు.. ఇక నుంచి తాము తయారు చేసిన డోసుల్లో 50 శాతం కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు ఓపెన్​ మార్కెట్​కు ఇవ్వొచ్చని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

కేంద్ర తీసుకున్న 50 శాతం డోసులను అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేయనున్నది. కరోనా వ్యాప్తి తీవ్రత ఆధారంగా ఏయే ప్రాంతాల్లో వ్యాక్సినేషన్​ ఇవ్వాలి.. అనే విషయాన్ని కేంద్రం నిర్ణయించనున్నది.

ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్​డౌన్​ విధించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కరోనా పై ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే ఫ్రంట్​ లైన్​ వారియర్స్ కు వ్యాక్సినేషన్​ ఇచ్చేశారు. రెండో దశ వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నది. 45 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్​ ఇస్తున్నారు.

అయితే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్​ డోసుల కొరత వేధిస్తున్నది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్​ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ .. అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మేరకు ప్రకటన జారీచేసింది.

Tags:    
Advertisement

Similar News