శంకర్ ప్రయోగం పనిచేస్తుందా?

దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ స్పెషల్ రోల్ కూడా ఉంది. దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న ఆ పాత్రను పవన్ కల్యాణ్ లేదా చిరంజీవితో చేయించే ప్లాన్ లో ఉన్నారంటూ మొన్నటివరకు కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు శంకర్ ఆలోచన మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. తన సినిమాల్లో గెటప్పులు, మేకప్పులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ దర్శకుడు.. రామ్ చరణ్ తో […]

Advertisement
Update:2021-04-19 15:11 IST

దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ
స్పెషల్ రోల్ కూడా ఉంది. దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న ఆ పాత్రను పవన్ కల్యాణ్ లేదా
చిరంజీవితో చేయించే ప్లాన్ లో ఉన్నారంటూ మొన్నటివరకు కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు
శంకర్ ఆలోచన మరోలా ఉన్నట్టు తెలుస్తోంది.

తన సినిమాల్లో గెటప్పులు, మేకప్పులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ దర్శకుడు.. రామ్ చరణ్ తో కూడా
అలాంటి గెటప్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ లేదా చిరంజీవి చేయబోయే ఆ పాత్రను గట్టిగా మేకప్
వేసి చరణ్ తోనే చేయిస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాడు.

కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం దీనికి ఒప్పుకున్నట్టు లేడు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టులోకి చరణ్ తో పాటు
పవన్ లాంటి మరో హీరో వస్తే దాని రేంజ్ మారిపోతుంది. అందుకే శంకర్ ను ఈ సినిమా వరకు మేకప్పులు,
గెటప్పులు పక్కనపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విదేశీ మేకప్ మెన్స్ కు ఇచ్చే డబ్బులకు
ఇంకాస్త ఎక్కువ కలిపి పవన్ లాంటి హీరోకు ఇస్తే ప్రాజెక్టు వెయిట్ పెరుగుతుందనేది దిల్ రాజ్ ఆలోచన.
లాజిక్ గా చూస్తే దిల్ రాజు ఆలోచనే కరెక్ట్ అనిపిస్తోంది కదా.

Tags:    
Advertisement

Similar News