తొలిసారి సెట్స్ పైకొచ్చిన హీరోయిన్

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇతర భాషా హీరోయిన్స్ సత్తా చాటుతూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పుడీ లిస్టులో మరో హీరోయిన్ చేరిపోయింది. మలయాళీ బ్యూటీ నజ్రియా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తమిళ్ డబ్బింగ్ సినిమా ‘రాజారాణి’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నజ్రియా ఎట్టకేలకు తెలుగులో సినిమా చేస్తుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వనుంది నజ్రియా. ఈరోజే ఈ […]

Advertisement
Update:2021-04-19 15:05 IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇతర భాషా హీరోయిన్స్ సత్తా చాటుతూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు.
ఇప్పుడీ లిస్టులో మరో హీరోయిన్ చేరిపోయింది. మలయాళీ బ్యూటీ నజ్రియా టాలీవుడ్ లోకి ఎంట్రీ
ఇచ్చింది.

ఇప్పటికే తమిళ్ డబ్బింగ్ సినిమా ‘రాజారాణి’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నజ్రియా
ఎట్టకేలకు తెలుగులో సినిమా చేస్తుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘అంటే
సుందరానికి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వనుంది నజ్రియా.

ఈరోజే ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టింది నజ్రియా. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా
తెలియజేసింది. “అందరికీ నమస్కారం…ఈరోజు నా మొదటి తెలుగు సినిమా షూట్ లో పాల్గొంటున్నాను.
ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ … అంటే సుందరానికి విల్ బీ స్పెషల్” అంటూ ఈ సినిమా తనకి ఎంత
స్పెషల్ అనే విషయాన్ని చెప్తూ ఫ్యాన్స్ తో సంతోషాన్ని పంచుకుంది.

ఇక నజ్రియా కి వెల్కం చెప్తూ అనుపమ పరమేశ్వరన్, రాశీ ఖన్నా సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు.
మరికొందరు సెలెబ్రిటీస్ కూడా ఆమెకి ఆల్ ది బెస్ట్ చెప్తూ విష్ చేశారు.

Tags:    
Advertisement

Similar News